Tollywood: రోడ్డుపై వెళ్తున్న స్టార్ హీరో కార్ కావాలన్న కుమారుడు.. ఆ కారే తెచ్చేసిన టాలీవుడ్ టాప్ కమెడియన్

|

Feb 03, 2023 | 6:09 PM

రాజబాబు.. వెండితెరపై చెరిగిపోని నవ్వులు పంచిన వ్యక్తి. ఆయన మాట్లాడే విధానం, హావభావాలు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. అప్పట్లో రమాప్రభ ఈయన కాంబినేసన్‌లో వచ్చిన సీన్స్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్.

Tollywood: రోడ్డుపై వెళ్తున్న స్టార్ హీరో కార్ కావాలన్న కుమారుడు.. ఆ కారే తెచ్చేసిన టాలీవుడ్ టాప్ కమెడియన్
Old Car (Representative image)
Follow us on

పుణ్యమూర్తుల అప్పలరాజు.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలీదు. సినిమా యాక్టర్ రాజబాబు అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆయన మాములు కమెడియన్ హా చెప్పండి. రాజాబాబు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించారు. అతని సోదరులు చిట్టి బాబు, అనంత్ బాబు.. ఇప్పుడు కూడా తెలుగు నాట సినిమాలు చేస్తున్నారు. ఆరంభంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. నాటకాలు కూడా వేసేవారు రాజబాబు. ఆ తర్వాత చెన్నై వెళ్లి సినిమాల్లో రాణించారు. 20 ఏళ్ల కెరీర్‌లో 589 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు రాజబాబు. తనయుడు రోడ్డు మీద వెళ్తున్న కారును చూసి.. కావాలని అడిగితే.. ఆ కార్ వెంటనే కొని రాజబాబు ఇంటికి తీసుకువచ్చారని ఓ వార్త ప్రచారంలో ఉంది.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రాజబాబు సోదరుడు చిట్టిబాబు. ” సాయంత్రం ఆరున్నర.. ఏడు గంటలు అవుతుంది. 2 పెగ్స్ వేసుకుని..పిల్లలతో కలిసి మెట్లమీద కూర్చుని ఉన్నారు అన్నయ్య రాజబాబు. అప్పుడే రోడ్డుపై నుంచి ఓ కారు వెళ్తుంది. అది తమిళ ప్రముఖ హీరో శివాజీ గణేశన్ కారు. డాడీ అలాంటి కార్ ఎప్పుడు కొంటావ్ అని పిల్లలు అడిగారు. దీంతో లుంగీ, షర్ట్‌తో ఉన్న వ్యక్తి అలానే శివాజీ గణేశన్ ఇంటికి వెళ్లిపోయాడు. ఆయన అన్నయ్యను ప్రేమతో ఇంట్లోకి స్వాగతించారు. వెంటనే నాకు ఆ కార్ కావాలి అని అడిగాడు అన్నయ్య రాజబాబు. అప్పుడు శివాజీ గణేశన్.. అది లక్ష రూపాయలురా.. ఏమనుకుంటున్నావ్ అన్నారు. లక్ష అయితే ఇచ్చేస్తాను.. ముందు కార్ ఇచ్చేయండి అన్నాడు రాజబాబు. మందు వేసి ఉండటంతో కాసేపు తటపటాయించిన శివాజీ గణేశన్.. కొద్దిసేపటికి కార్ తాళాలు తెచ్చి ఇచ్చేశారు. కార్ తీసుకొచ్చి.. పిల్లల్ని ఎక్కించుకుని రెండు రౌండ్లు వేసి.. దాన్ని షెడ్లో పెట్టేశాడు. తెల్లారి 25 వేలు శివాజీ గణేశన్‌ పంపారు అన్నయ్య రాజబాబు. ఆయన కబురు పెట్టడంతో మళ్లీ వెళ్లి.. 75 వేలు ఇచ్చి కార్ నాకు కావాలి అనే చెప్పేసి.. వచ్చేశాడు” అని కారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పంచుకున్నారు చిట్టిబాబు.

Rajababu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..