Chiyaan Vikram: మహేశ్- రాజమౌళి సినిమాలో చియాన్ విక్రమ్.. అసలు విషయం చెప్పేసిన కోలీవుడ్ స్టార్ హీరో

'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేతులు కలిపాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఇప్పటికే ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు .

Chiyaan Vikram: మహేశ్- రాజమౌళి సినిమాలో చియాన్ విక్రమ్.. అసలు విషయం చెప్పేసిన కోలీవుడ్ స్టార్ హీరో
Chiyaan Vikram, Mahesh Babu
Follow us

|

Updated on: Aug 05, 2024 | 10:08 PM

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేతులు కలిపాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఇప్పటికే ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు . ఇప్పుడు ఈ చిత్ర బృందంతో చియాన్ విక్రమ్ పేరు కూడా చేరిపోయింది. దానికి కారణం స్వయంగా విక్రమ్ చేసిన ప్రకటన. చియాన్ విక్రమ్ ‘తంగళన్’ సినిమాలో నటించాడు. కోలార్ బంగారు గని కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దానికి ప్రచారం కల్పించేందుకు చిత్రబృందం ఇటీవల హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా విక్ర‌మ్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ ‘మ‌హేశ్ – రాజ‌మౌళి కాంబోలో వ‌స్తున్న సినిమాలో మీరు న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై మీ రియాక్ష‌న్ ఏంటి అని అడుగ‌గా.. దీనికి విక్రమ్ స్పందిస్తూ.. ‘ డైరెక్టర్ రాజ‌మౌళి చాలా మంచి వ్యక్తి. ఆయ‌న‌ నేను అప్పుడ‌ప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాను. అయితే మ‌హేశ్ – రాజ‌మౌళి కాంబోలో వ‌స్తున్న సినిమాపై మేము ఇప్ప‌టివ‌ర‌కు మాట్లాడలేదు. ఆ టాపిక్ కూడా రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా మహేశ్- రాజమౌళిల సినిమాలో తాను నటించడం లేదన్న విషయాన్ని క్లారిటీగా చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

చాలా రోజుల తర్వాత విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం తంగ‌లాన్. ‘క‌బాలి’, ‘కాలా’, ‘స‌ర్ప‌ట్ట ప‌రంప‌ర’ చిత్రాల‌ తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొతు కథానాయికలుగా కనిపించనుండగా, పశుపతి, హాలీవుడ్ న‌టుడు డానియెల్‌ కల్టగిరోన్‌ తదితరులు ప్రధాన పాత్రలు‌ పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న తంగలాన్ సినిమా ఇండిపెండెన్స్ కానుక‌గా ఆగ‌ష్టు 15న విడుద‌ల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగానే మహేశ్- రాజమౌళి సినిమాపై స్పందించాడు విక్రమ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
మిల్క్ పౌడర్‌తో టేస్టీ బర్ఫీ.. నోట్లే వేస్తే కరిగి పోతుంది..
మిల్క్ పౌడర్‌తో టేస్టీ బర్ఫీ.. నోట్లే వేస్తే కరిగి పోతుంది..
బంగ్లాదేశ్‌ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం..
బంగ్లాదేశ్‌ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం..