PM Modi: బంగ్లాదేశ్‌ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం..

మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలపై పలువురు మంత్రులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షాతో పాటు మరికొందరు...

PM Modi: బంగ్లాదేశ్‌ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం..
Narendra Modi
Follow us

|

Updated on: Aug 05, 2024 | 9:33 PM

మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలపై పలువురు మంత్రులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షాతో పాటు మరికొందరు మంత్రులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు మోదీతో ప్రత్యేకంగా సమావేశమైన జై శంకర్‌ బంగ్లాదేశ్ పరిణమాలను వివరించారు.

అంతర్యుద్ధం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత పౌరులను అప్రమత్తం చేసింది ఇండియన్ ఎంబసీ. అత్యవసరమైతే తప్ప బైటికి వెళ్లకూడదని అలర్ట్‌ చేసింది. హింసాత్మక వాతావరణం చల్లబడేవరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని ఇక్కడున్నవారిని హెచ్చరించింది. ఢాకాలోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలంటూ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసింది భారత విదేశాంగ మంత్రిత్వశాఖ. పొరుగుదేశంలో పరిణామాల్ని కూడా ఓ కంటి కనిపెడుతూ.. ఆచితూచి స్పందిస్తోంది మోదీ సర్కార్.

ఇదిలా ఉంటే ప్రధానిగా రాజీనామా చేసిన అనంతరం షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. భారత్ తనకు “సురక్షితమైన ప్రదేశం”గా ఆమె పరిగణించారు. గత కొన్నేళ్లుగా షేక్ హసీనా, ఆమె ప్రభుత్వానికి భారత్ బలమైన మిత్రదేశంగా ఉంది. బంగ్లాదేశ్ అనేక ఈశాన్య భారత రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటోంది, ఈ ప్రాంతాలు చాలావరకు తీవ్రవాద సమస్యలను ఎదుర్కొన్నాయి. హసీనా తన పదవీ కాలంలో బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే భారత వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులపై చర్యలు తీసుకున్నారు. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేసింది. అంతేకాదు భారత్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు సరకులు రవాణా చేయడానికి హసీనా ప్రభుత్వం హక్కులను మంజూరు చేసింది. ఈ మద్దతు రెండు దేశాల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టం చేసింది.

ఇక షేక్‌ హసీనా 1996లో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి భారతదేశంతో సన్నిహితంగా ఉన్నారు. ఆమె ఢాకా, దిల్లీల మధ్య సంబంధాలను సమర్థించారు. బంగ్లాదేశ్ కోసం 1971లో స్వాతంత్ర్య సమరంలో భారత్ నుంచి అందిన కీలకమైన మద్దతును 2022లో ఇండియా పర్యటన సందర్భంగా హసీనా గుర్తు చేసుకున్నారు. అయితే, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ (హసీనా పార్టీ)తో సన్నిహితంగా ఉండడం కాకుండా బంగ్లాదేశ్ ప్రజల విస్తృత ప్రయోజనాలకు భారత్ మద్దతు ఇవ్వాలని అక్కడి ప్రతిపక్షాలు విమర్శించాయి.

బంగ్లాదేశ్‌లో అసలేం జరుగింది.?

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో కొన్నాళ్లుగా అట్టుడుకుతోంది బంగ్లాదేశ్. అధికార అవామీ లీగ్ కార్యకర్తలు ఒక వైపు.. ఆందోళనకారులు ఒకవైపు నిలబడి బంగ్లాదేశ్‌ను యుద్దభూమిగా మార్చేశారు. ప్రభుత్వం కూడా ఈ ఘర్షణకు ఆజ్యం పోస్తూ.. యూనివర్సిటీలను మూసేయించింది. దీంతో నిరసన జ్వాల మరింతగా చెలరేగి నెక్స్ట్‌ లెవల్‌కి చేరింది. ఏకంగా జిల్లా జైలుకు నిప్పంటించి.. ఖైదీల్ని విడుదల చేయించి.. ఒక నేషనల్ టీవీ ఛానెల్‌పై దాడి చేసి.. దేశవ్యాప్త వీరంగం సృష్టించారు. ప్రధాని కార్యాలయాన్ని, బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకును ఎటాక్ చేశారు. బంగ్లాదేశ్‌లో 64 జిల్లాలుంటే 47 జిల్లాలకు వ్యాపించింది ఉద్యమం. ఏకంగా పోలీస్ చీఫ్ వెబ్‌సైట్లనే హ్యాక్ చేసి.. ప్రభుత్వ యంత్రాగాలకు బహిరంగ సవాల్ విసిరారు నిరసనకారులు. దాదాపు నెల రోజుల కిందట మొదలైన గొడవల్లో 300 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో డజన్లకొద్దీ పోలీసులు ఉన్నారంటే హింస ఏ స్థాయిలో పేట్రేగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సిరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన మూకుమ్మడి దాడిలో ఏకంగా 13 మంది పోలీసులు సజీవదహనమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..