కంటి ఆరోగ్యం అనగానే క్యారెట్ గుర్తు రావడం సర్వసాధారణం. క్యారెట్‌లోని బీటా కెరొటిన్, విటమిన్ ఏ కంటి చూపును మెరుగు పరచడంలో ఉపయోగపడుతుంది. కంటి సమస్యలను దరిచేరనివ్వదు.
కంటి చూపును మెరుగుపరచడంలో పాలకూర కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని లుటీన్, జియాన్తీన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే బంగాళదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ కంటిచూపును కాపాడుతాయి.
గుడ్లలో ఉండే లూటీన్, గ్జియాన్తీన్ విటమిన్ ఏ, జింక్ వంటి పోషకాలు కంటి చూపును కాపాడుతాయి. వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలకు చెక్ పెడతాయి
కళ్లకు మేలు చేసే వాటిలో చేపలు కూడా ముఖ్యమైనవి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కళ్లు పొడిబారకుండా ఉంచడంలో ఉపయోగడతాయి.
విటమిన్ ఇకి పెట్టింది పేరైన బాదం కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ క్యాటరాక్ట్ సమస్యల నుంచి బయట పడేస్తాయి.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ కూడా కంటికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులోని ఆక్సిడెంట్లు కంటిని డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.