ఏజ్ తో పాటు మెమొరీ లాస్ కూడా పెరిగింది అంటున్న అనసూయ
Phani CH
05 AUG 2024
అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు.. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటుంది.
బుల్లితెరకు దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ.
తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ మారి ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.
తర్వాత నెమ్మది గా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ.
అయితే తాజాగా `సింబా` ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న అనసూయ.. సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి చెప్పింది అనసూయ. కొందరి పేర్లు మర్చిపోయింది.
దీంతో తనకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చిందని చెప్పింది. అంతటితో ఆగలేదు. తనకు ఏజ్ అయిపోతుందేమో, అందుకే ఇలా మెమొరీ లాస్ వస్తుందని చెప్పి పెద్ద షాకిచ్చింది.
జగపతిబాబు, అనసూయ, దివి, గాయత్రి, కస్తూరి, వశిష్ట, శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కాబోతుంది.