“ప్లాస్మా దానం చేయండి..ప్రాణ దాత‌లు కండి”

కోవిడ్ నుంచి కోలుకున్న వారిని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని చిరు పిలుపునిచ్చారు.

ప్లాస్మా దానం చేయండి..ప్రాణ దాత‌లు కండి

Updated on: Jul 25, 2020 | 5:14 PM

Megastar Chiranjeevi  : కోవిడ్ నుంచి కోలుకున్న వారిని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని చిరు పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ఇత‌రుల‌ ప్రాణాలను కాపాడాలని కోరారు. ఇప్పుడున్న క్రైసిస్‌లో కోవిడ్ వారియ‌ర్లు… సేవియ‌ర్లుగా మారాల‌ని శనివారం మెగాస్టార్ ట్వీట్‌ చేశారు. యావత్‌ ప్రపంచాన్ని క‌రోనా వణికిస్తున్న సంక్షోభ‌ పరిస్థితుల్లో కోవిడ్ విజేతలు మాన‌వ‌త్వాన్ని చాటుకోవాల‌ని కోరారు.

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా డోనేట్ చేయ‌డానికి ముందుకు రావాలంటూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఇచ్చిన పిలుపుపై మెగాస్టార్ ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు సజ్జనార్ మాట్లాడిన ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.

కాగా క‌రోనా వ్యాప్తి ప్రారంభం అయిన‌ప్ప‌టి నంచి చిరంజీవి ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌నలు చేస్తూనే ఉన్నారు. మొద‌ట్లో క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు గురించి వీడియో చేసిన చిరు..ఇటీవ‌ల ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మాస్క్ అవ‌స‌రాన్ని వివ‌రిస్తూ మ‌రికొన్ని వీడియోలు చేశారు.

ఇది కూడా చ‌దవండి: ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..