కన్నడ హీరో చిరంజీవి సర్జా 36 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కుదిపేసింది. అయితే చిరంజీవి చనిపోయే సమయానికే అతని భార్య మేఘన రాజ్ గర్భవతి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆమెకు చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో సీమంతం కూడా చేసారు. అయితే మేఘనా రాజ్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా బావోద్వేగంతో చెబుతోన్న విషయం తెలిసిందే. అన్నయ్య లేకపోయినా కూడా మేఘనను తల్లిలా చూసుకుంటున్నాడు ధృవ. కాగా ఈరోజే చిరంజీవి సర్జా, మేఘనల ఎంగేజ్ మెంట్ డే అని తెలుస్తోంది.