నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..

ఓటీటీలో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు యమా డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా రొమాంటిక్, హారర్ సినిమాలు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమాలో హింస మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..
Ott Movie

Updated on: Nov 05, 2025 | 3:35 PM

ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తూనే.. ఓటీటీలో రకరకాల జోనర్స్ లో సినిమాలు చూస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ సినిమాల్లో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, క్రైమ్ సస్పెన్స్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎక్కువ మంది అలాంటి సినిమాలే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాబోయ్ ఈ సినిమా చూడాలంటే గుండె దైర్యం ఉండాలి. ఒంటరిగా ఈ సినిమా చదువుకపోవడమే మంచిది. ఈ సినిమా ఓటీటీలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. అలాగే ట్రెండింగ్ లో ఉంది ఈ మూవీ. ఇంతకూ ఈ సినిమా ఏంటంటే..

ఈ సినిమాను హింసాత్మక ఘటనల ఆధారంగా తెరకెక్కించారు.. సినిమా చాలా హింసాత్మగా ఉంటుంది. ఊహించని ట్విస్ట్‌లతో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్షకులను కూర్చోబెడుతుంది ఈ థ్రిల్లర్.. ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలు ఇద్దరు సైకోల మధ్య జరుగుతుంది. సినిమా మొత్తం రచ్చ రచ్చగా ఉంటుంది. నలుగురు అమ్మాయిలు చిలీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఒంటరి కాటేజీకి వెళ్తారు. అక్కడ వీరు మద్యం పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి మహిళలపై ద్వేషం పెంచుకున్న ఓ జవాన్ అతని కుమారుడు మారియో వస్తారు.

అక్కడి నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది.  ఆ జవాన్ కొడుకు ఆ అమ్మాయిల పై దాడి చేస్తాడు. వారి పై లైంగికంగానే కాకుండా హింసాతంకంగా దాడి చేస్తాడు. ఆ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి.. చూస్తేనే వణుకొస్తుంది. అక్కడి నుంచి ఓ అమ్మాయి తప్పించుకుంటుంది. ఆమె అక్కడికి దగ్గరలో ఉన్న ఓ గ్రామానికి వెళ్తుంది. కానీ అక్కడి గ్రామస్థులు ఆమెను పట్టించుకోరు. ఆ తర్వాత అక్కడ దాడికి పాల్పడ్డ అమ్మాయిలు ఓ పోలీసు అధికారితో కలిసి ఆ సైకోల పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అయితే ఆ అమ్మాయిలు విజయం సాధించారా.? ఆతర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు ట్రామా.. ప్రస్తుతం ఈ సినిమా Shudder, MUBI, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి