
ఓటీటీలో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాగే హారర్, రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.. తెలుగులో హారర్, రొమాంటిక్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాలో సీన్స్ ఎంత భయంకరంగా ఉన్నా.. వణికించినా.. కొందరు ఏమాత్రం భయపడకుండా చూస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ.. సీన్ సీన్‌కు సుస్సుపోయించే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. బాబోయ్ ఈ సినిమా చూస్తే అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు కనిపిస్తే సుస్సూ పడిపోతుంది. అందంతో కుర్రాళ్లకు వల వేసి.. వారిని చంపి తినే అమ్మాయి కథ ఇది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే బెటర్.. ఇంతకూ ఈ సినిమా ఏంటి.? అక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.? అనేది చూద్దాం.!
స్కూల్ చీర్‌లీడర్ జెన్నిఫర్ ఒక డెమన్‌కు గ్రాసమై, సుకువస్ (పురుషులను ఆకర్షించి చంపే డెమన్)గా మారిపోతుంది. ఆమె తన స్నేహితులలో అబ్బాయిలను తన అందంతో కవ్వించి, ముగ్గులోకి దింపి ఆతర్వాత అతన్ని చంపి, వారి శవాలను తింటూ జీవితం కొనసాగిస్తుంది. అయితే ఆమె బెస్ట్ ఫ్రెండ్ నీడీ భయానకత్వాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది. ఆతర్వాత ఏం జరిగింది. ఆమె ఆ దెయ్యాన్ని ఎలా ఆపింది అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమాలో హారర్, కామెడీ, మహిళలపై సెక్సువల్ ఆబ్జెక్టిఫికేషన్, బాడీ ఆటానమీ వంటి సామాజిక అంశాలను చూపిస్తారు.
2009లో విడుదలైన ఈ అమెరికన్ హారర్-కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 1 గంట 42 నిమిషాల ఈ సినిమా’లో రొమాంటిక్ సీన్స్ తో పాటు వణికించే భయానక సీన్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ IMDb 5.5/10 సొంతం చేసుకుంది. ఈ సినిమాను దైర్యం ఉన్నవాళ్లే చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .