Chaavu Kaburu Challaga Movie : చావు కబురు చల్లగా మూవీ రివ్యూ.. సరికొత్త కథతో ఆకట్టుకుంటున్న సినిమా

|

Mar 19, 2021 | 5:44 PM

యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Chaavu Kaburu Challaga Movie : చావు కబురు చల్లగా మూవీ రివ్యూ.. సరికొత్త కథతో ఆకట్టుకుంటున్న సినిమా
Chavu Kaburu Challaga
Follow us on

Chaavu Kaburu Challaga Movie review :

నటీనటులు: కార్తీకేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, అనసూయ భరద్వాజ్, ఆమని, మురళీశర్మ

రచన, దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాత: బన్నీ వాసు

యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పడు చూదాం.

కథ : బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాల బండి నడుపుతుంతుంటాడు. రోజూ శవాల దగ్గరికెళ్లి.. వాటిని శ్మశానాలకు తీసుకువెళ్తుంటాడు. దాంతో మనిషి చావు పట్ల ఏమాత్రం లెక్కలేకుండా తయారవుతాడు బాలరాజు. ఈ క్రమంలోనే భర్త చనిపోయి శోఖంలో మునిగిన మల్లిక (లావణ్య)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ మల్లిక అతడిని తీవ్రంగా ద్వేషిస్తుంది. మరి మల్లిక మనసును బాలరాజు మార్చాడా.. బాలరాజు ప్రేమను మల్లిక ఒప్పుకుందా అనేది మిగతా కథ

మొదటి భాగం అంతా బస్తీబాలరాజు క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు. మల్లిక భర్త చనిపోయిన సీన్‌తో అసలు కథ మొదలవుతుంది. మల్లిక వెంటన బాలరాజు పడటం లాంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి. బాలరాజు, తల్లి గంగి మధ్య సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతాయి. బస్తీ బాలరాజు క్యారెక్టరైజేషన్, కార్తికేయ నటన సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. సినిమా,పాత్రలు – వాటి నేపథ్యం.. కథను ఆరంభించిన తీరు కొత్తగా అనిపిస్తుంది.

పాత్రలను.. సన్నివేశాలను వాస్తవికంగానే చూపించే ప్రయత్నం చేశారు. ఐతే ఒక చదువుకున్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి.. బస్తీలో చదువూ సంధ్యా లేకుండా శవాల బండికి డ్రైవర్ గా పని చేసే అబ్బాయిని ప్రేమించడం అన్నది ఇంట్రస్టింగ్ గా చూపించారు. తల్లితో ముడిపడి ఉన్న ఓ భావోద్వేగమైన అంశాన్ని జోడించి కథను మరింత ఎమోషనల్‌గా మార్చడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. తొలి భాగంలో వినోదానికి పెద్ద పీట వేశారు. ఆమని, కార్తీకేయ మధ్య సన్నివేశాలు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్‌తో కొన్ని సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే లావణ్య త్రిపాఠిని తన ప్రేమను ఒప్పుకొనే విధంగా బాలరాజు చేసే ప్రయత్నాలు చాలా ఎమోషనల్‌గా సాగుతాయి.

చివరగా … ఆకట్టుకున్న మొరటోడి ప్రేమ కథ