రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర్మాతలు.
గతకొద్దిరోజులుగా.. ఈ సినిమా గురించి అటు రాజకీయంగా.. ఇటు ఇండస్ట్రీ పరంగా.. రగడ జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను రాంగోపాల్ వర్మ ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తానని ప్రకటించినా.. సెన్సార్ బోర్డు వ్యతిరేకత వల్ల రిలీజ్ కాలేదు. దీంతో.. హైకోర్టుకు వెళ్లాడు వర్మ. ఈ వివాదంపై స్పందించిన హైకోర్టు వారం రోజుల్లోగా సినిమాను పరిశీలించి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేశం ఇచ్చింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి.. అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌కి హైకోర్టు సూచించింది. అయితే.. ఇప్పట్లో.. ఈ సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించడంలేదు. మరి వర్మ ఇప్పుడు ఏం చేస్తాడో.. చూడాలి.