
పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. అవును.. ఒక్క సినిమాతోనే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విభిన్న కంటెంట్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. అతడు మలయాళీ స్టార్ హీరో నివిన్ పౌలీ. కొన్ని అసాధారణ చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతడి తల్లిదండ్రులు దాదాపు 25 సంవత్సరాలుగా స్విట్జర్లాండ్ లోని ఆరావులో స్థిరపడ్డారు. కానీ నివిన్ తన అక్కతో కలిసి అలువాలోని తమ నానమ్మ ఇంట్లో పెరిగాడు.
నివిన్ పౌలీ కొచ్చిలోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (FISAT) నుండి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2006 నుండి 2008 వరకు బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2008లో తన తండ్రి ఆకస్మిక మరణం తర్వాత అతను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళకు తిరిగి వచ్చాడు. మలర్వాడ్ ఆర్ట్స్ క్లబ్ మూవీతో అరంగేట్రం చేసిన నివిన్.. 2010లో తన ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత తన క్లాస్ మేట్, స్నేహితురాలు రిన్నా జాయ్ ను వివాహం చేసుకున్నాడు.
కానీ హీరోగా అతడి కెరీర్ మలుపు తిప్పిన సినిమా ప్రేమమ్. ఈ మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతను మాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే యంగ్ హీరోలలో ఒకడిగా మారిపోయాడు. ఇప్పుడు సినీరంగంలో విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..