కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. ఎవరో తెలుసా.?

|

Dec 06, 2024 | 12:35 PM

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో తెలుసా.?

కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. ఎవరో తెలుసా.?
Tollywood
Follow us on

సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కుర్ర హీరోలు. పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కొంతమంది యంగ్ హీరోలు ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. పై ఫొటోలో ఉన్న కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు ఎవరో తెలుసా.? అతను వరుస విజయాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్‌గా ఆయన ఓ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఏకంగా వందకోట్లకు పైగా వసూల్ చేసింది ఆ సినిమా. ఇంతకూ పై ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో కనిపెట్టరా.? అతనంటే అమ్మాయిలు పడిచచ్చిపోతారు. ఇంతకూ అతను ఎవరంటే..

ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..

పై ఫొటోలో ఉన్న యంగ్ హీరో ఎవరో కాదు. రీసెంట్ గా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మలయాళంలో వరుసగా సినిమాలు చేసి మెప్పించిన దుల్కర్ తెలుగులో నేరుగా మహానటి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఓకే బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇవి కూడా చదవండి

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఆతర్వాత హనురాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆతర్వాత రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఆ అలాగే లక్కీ భాస్కర్ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక దుల్కర్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే దుల్కర్ మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.