8 సినిమాలు చేస్తే 7 అట్టర్ ఫ్లాప్.. అయినా ఇప్పుడు లైన్‌లో రెండు పాన్ ఇండియా మూవీస్

ప్రస్తుతం కొత్త భామల హవా కనిపిస్తుంది. వరుస సినిమాలతో కుర్ర హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు వెంటనే మూడు నాలుగు సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా అంతే..

8 సినిమాలు చేస్తే 7 అట్టర్ ఫ్లాప్.. అయినా ఇప్పుడు లైన్‌లో రెండు పాన్ ఇండియా మూవీస్
Actress

Updated on: Feb 22, 2025 | 12:25 PM

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీల హడావిడి మాములుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. సినిమాల రిజెల్ట్ తో సంబంధాలు లేకుండా వరుసగా ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ అమ్మడు కూడా అంతే .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది ఈ చిన్నది. తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది. సినిమాలు హిట్స్ అవ్వకపోవడంతో గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో ఎనిమిది సినిమాలు చేసింది కానీ ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఈ చిన్నదానికి క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది.

సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది. మొత్తంగా ఈ చిన్నది ఎనిమిది సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. వాటిలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా ఒకటి. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత నిధి అగర్వాల్ క్రేజ్ మరింత పెరగనుంది.

నిధి అగర్వాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.