సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోలో ఉన్న ఈ బుజ్జాయి.. ఎవరో తెలుసా..? నెట్టింట అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ… మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. అయితే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుంది అనుకున్నఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఓ స్టార్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన ఈ తార.. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇంతకీ ఆ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి. ఆమె భర్త కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ కనిపించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇంతకీ ఆ క్యూటీ ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ సయోషా సైగల్. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ.. తెలుగుతోపాటు.. హిందీ.. తమిళ్ చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో ఫస్ట్ మూవీ అఖిల్. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా సయోషాకు ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో అలరించిన ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే సయోషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.