
మెగాస్టార్ చిరంజీవి సతీమణి గా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సురేఖమ్మ. దివంగత నటుడు అల్లు రామలింగయ్య కూతురు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు సోదరైన ఆమె చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగేందుకు అన్ని రకాలుగా అండగా నిలిచారని చెప్పవచ్చు. ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉంటే తనే ఇంటి బాధ్యతలను మొత్తం తీసుకుంది. ఇక సురేఖ ని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు వృత్తి గతంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కలిసొచ్చిందని చిరంజీవే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సంగతి పక్కన పెడితే.. ఒకప్పుడు సురేఖమ్మ చేతుల మీదుగా డబ్బులు తీసుకున్న చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారని చెప్పవచ్చు. అందులో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాల్లోకి రాక ముందు, వచ్చాక కూడా పవన్ కు ఖర్చుల కోసం పాకెట్ మనీగా చాలా సార్లు డబ్బు ఇచ్చారట. సురేఖ. అలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాగానే సురేఖమ్మ చేతుల మీదుగా 5 వేలు తీసుకున్న ఒకతను ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తీస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. అతనే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు.
మెగా,అల్లు ఫ్యామిలీలకు ఎంతో సన్నిహితుడైన బన్నీ వాసు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాకు కో ఆర్డినేటర్ గా పని చేశాడు బన్నీవాసు. సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు అల్లు అర్జున్, దిల్ రాజుతో చాలా సరదాగా ‘పశ్చిమ గోదావరి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మనవాళ్లకే ఇవ్వొచ్చు కదా?’ అని అడిగాడట. వెంటనే దిల్ రాజు, బన్నీ వాసుని పిలిపించి ఓ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడమన్నాడు. అయితే అతను భారీ రేటు చెప్పాడట. దీంతో దిల్ రాజు ‘ అతన్ని వదిలెయ్. మొత్తం బిజినెస్ నువ్వే హ్యాండిల్ చెయ్’ అని బన్నీ వాసుకు బంఫర్ ఆఫర్ ఇచ్చారట. అయితే ఆ సమయంలో బన్నీ వాసు దగ్గర సరిపడా డబ్బు లేదట. అన్నీ పాకెట్స్ వెతికితే కేవలం రూ.45 మాత్రమే దొరికాయట. దీంతో 45 రూపాయలను దిల్ రాజు చేతిలో పెట్టి మిగతా డబ్బు తర్వాత ఇస్తానని మాట ఇచ్చాడట బన్నీ వాస్.
ఆర్య సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా మిగిలిన డబ్బు కోసం మెగా ఫ్యామిలీని కలిశాడట బన్నీ వాసు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ దగ్గర రూ.5,000 అప్పుగా తీసుకుని, వెంటనే నిర్మాత దిల్ రాజుకు పంపించాడట. ఆ సమయంలో అల్లు అరవింద్ భార్య కూడా ఈ నిర్మాతకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసిందట. ఈ విషయాన్ని ఇటీవలే బయట పెట్టాడు బన్నీవాసు. అయితే ఇప్పటికీ ఆ డబ్బు తిరిగివ్వలేదని నవ్వుతూ చెప్పాడీ టాలీవుడ్ ప్రొడ్యూసర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.