RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆరంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై ఈ మూవీ పోస్టర్స్ బిజినెస్ కూడా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్, గిరిజన వీరుడు కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి కోరిక మేరకు ‘ఆర్ఆర్ఆర్’ కి అలియా ఓ పాట పాడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పాటను అలియాపైనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అయితే ఇతర భాషలు కాకుండా ఈ పాట హిందీ వెర్షన్‌ను మాత్రమే ఆలియా పాడనుందట. ఇక అలియా భట్ మంచి సింగర్ కూడా అన్న సంగతి బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే.. గతంలో ఆమె ‘హైవే’, ‘హంటీ శర్మా కీ దుల్హనియా’ వంటి సినిమాలో పాటలు పాడి అలరించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం మరోసారి గొంతు సవరించనుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అమ్మడి పాట ఎలా ఉంటుందో. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :