Bollywood: బాలీవుడ్‌లో నయా జోష్.. సీక్వెల్స్‌తో సూపర్ హిట్స్ అందుకున్న హీరోలు..

ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా.. హిట్ సినిమాకు సీక్వెల్ చేస్తే ముందు వెనక చూడకుండా ట్రాక్టర్స్ తీసుకుని మరీ థియేటర్స్ ముందు క్యూలు కడతారా..? కొన్నేళ్లుగా సీక్వెల్స్‌కు వస్తున్న కలెక్షన్స్ ట్రేడ్‌ పండితులకు సైతం షాక్ ఇస్తున్నాయి. మరింతకీ ఏంటా సీక్వెల్స్..? సీక్వెల్.. ఈ పదానికి ఇప్పుడున్న డిమాండ్ మాటల్లో చెప్పడం కష్టమే. హిట్ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాలపై మామూలుగానే హైప్ ఉంటుంది.. ఇక అవి కాస్త బాగున్నా కలెక్షన్ల సునామీ ఖాయం.

Bollywood: బాలీవుడ్‌లో నయా జోష్.. సీక్వెల్స్‌తో సూపర్ హిట్స్ అందుకున్న హీరోలు..
Omg 2, Gadar 2

Edited By: Rajeev Rayala

Updated on: Aug 15, 2023 | 1:32 PM

ఒక సినిమాకు సీక్వెల్ వస్తే అది పక్కా హిట్టే.. ఏంటి సీక్వెల్స్‌కి నిజంగా అంత పవర్ ఉందా..? 20 ఏళ్ళ కింద హిట్ కొట్టిన హీరో కూడా సీక్వెల్ చేస్తే ఎగబడి చూస్తారా..? ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా.. హిట్ సినిమాకు సీక్వెల్ చేస్తే ముందు వెనక చూడకుండా ట్రాక్టర్స్ తీసుకుని మరీ థియేటర్స్ ముందు క్యూలు కడతారా..? కొన్నేళ్లుగా సీక్వెల్స్‌కు వస్తున్న కలెక్షన్స్ ట్రేడ్‌ పండితులకు సైతం షాక్ ఇస్తున్నాయి. మరింతకీ ఏంటా సీక్వెల్స్..? సీక్వెల్.. ఈ పదానికి ఇప్పుడున్న డిమాండ్ మాటల్లో చెప్పడం కష్టమే. హిట్ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాలపై మామూలుగానే హైప్ ఉంటుంది.. ఇక అవి కాస్త బాగున్నా కలెక్షన్ల సునామీ ఖాయం.

తాజాగా గదర్ 2 విషయంలో జరుగుతుందిదే. 20 ఏళ్లుగా హిట్ లేని సన్నీ డియోల్.. గదర్ 2తో గర్జిస్తున్నారు. 3 రోజుల్లోనే ఈ చిత్రం ఇండియాలో 138.. ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్లకు పైగా వసూలు చేసింది. గదర్ 2 ఫస్ట్ డే 40 కోట్లు వసూలు చేస్తే.. రెండు, మూడు రోజుల్లో 43, 51 కోట్లు వసూలు చేసింది. 2001లో వచ్చిన గదర్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్. దాన్ని ఓన్ చేసుకున్నట్లే.. ఈ సీక్వెల్‌ను ఆదరిస్తున్నారు బాలీవుడ్ ఆడియన్స్.

ఇక ఓ మై గాడ్ సీక్వెల్‌కు మంచి వసూళ్లే వస్తున్నాయి. ఆ మధ్య కేజియఫ్ 2 సైతం 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ పార్ట్ 240 కోట్ల దగ్గరే ఆగిపోతే.. పార్ట్ 2 దానికి ఐదింతలు ఎక్కువగా కలెక్ట్ చేసింది. కేజియఫ్ 2 సంచలనానికి పార్ట్ 1 విజయమే పునాది. 2015లో బాహుబలి ది బిగినింగ్ 500 కోట్లకు పైగా వసూలు చేస్తే.. 2017లో వచ్చిన దాని సీక్వెల్ ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లు కొల్లగొట్టింది. సీక్వెల్‌కు ఉన్న పవర్ అలాంటిది మరి. ఏక్ థా టైగర్ సీక్వెల్ టైగర్ జిందా హై కూడా 500 కోట్లకు పైగానే వసూలు చేసింది. మొత్తానికి ఈ కలెక్షన్స్ లెక్కలు చూసాక.. సీక్వెల్స్‌కు అంత పవర్ ఉంటుందా అంటే అవుననే చెప్పాలి.

అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మంచి విజయాన్ని అందుకొని బాలీవుడ్ లో కొత్త జోష్ ను నింపింది.


సన్నీ డియోల్ గద్దర్ 2 గ్రాండ్ సక్సెస్ అందుకుంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.