Pushpa 2: పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ట్రెండింగ్ హీరోయిన్.. ఈసారి సమంతకు మించి..

|

Oct 21, 2024 | 1:08 PM

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది.

Pushpa 2: పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ట్రెండింగ్ హీరోయిన్.. ఈసారి సమంతకు మించి..
Allu Arjun Pushpa 2 Movie
Follow us on

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప 2. సుమారు మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్. ఐకాన్ స్టార్ హీరోగా నటిస్తోన్న ఈ క్రేజీ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ పుష్ప సీక్వెల్ పై అంచనాలను పెంచేశాయి. ఇక పుష్ప పార్ట్‌ 1 లో సక్సెస్ లో సమంత స్పెషల్ సాంగ్ కు కూడా భాగముంది. ఊ అంటావా మావా అంటూ ఆమె వేసిన హుషారైన స్టెప్పులు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పు ష్ప పార్ట్‌ 2లోనూ స్పెషల్ సాంగ్ విషయంలో అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ పాటలో ఎవరు నటిస్తారన్నాది ఇప్పటవరకు క్లారిటీ రాలేదు. ఆ మధ్యన దిశా పటానీ పేరు వినిపించింది. అలాగే యానిమల్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు కూడా వార్తల్లో వినిపించింది. అయితే అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా స్ట్రీ2 హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ తో స్పెషల్ సాంగ్ చేయించనున్నారని సమాచారం. అయితే దీనిపై కూడా ఇంకా అదికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం నార్త్ హీరోయిన్ ను పెడితే బాలీవుడ్ లో మూవీకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట మేకర్స్ . అందులో భాగంగానే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శ్రద్ధా కపూర్ ను ఈ పాట కోసం సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న శ్రద్ధా తెలుగు ఆడియెన్స కు కూడా సుపరిచితమే. గతంలో ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో సందడి చేసిందీ అందాల తార. ఇటీవల ఆమె నటించిన స్త్రీ 2 సినిమా ఏకంగా 800 కోట్ల రాబట్టడం విశేషం. కాబట్టి పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఆమె తో చేయిస్తేనే అటు నార్త్, ఇటు సౌత్ లోనూ క్లిక్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

 

మరో 45 రోజుల్లో పుష్ప 2 రిలీజ్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.