Ramayana: ‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన రామాయణ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ వారం చివరి నాటికి 1000 కోట్ల వసూళ్ల మార్కును దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సుమారు 20 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ కూడా తాను 'రామాయణం' సినిమా చేస్తానని ప్రకటించారు.

Ramayana: శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే రామాయణ సినిమా ప్రకటన.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Ramayana Movie

Updated on: Nov 09, 2026 | 8:52 PM

రణ్ బీర్ కపూర్, యశ్ , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లుతోంది. దసరా కానుకగా నవంబర్ 05న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ వారం చివరి నాటికి 1000 కోట్ల వసూళ్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ‘రామాయణం’ భారీ స్థాయిలో విడుదలైంది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల పెర్ఫామెన్స్ ‘రామాయణ’ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇదిలా ఉండగా, సుమారు 20 ఏళ్ల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ‘రామాయణం’ సినిమా చేస్తానని ప్రకటించారు. అయితే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే ఆగిపోయింది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మాతృభూమి’ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు సల్మాన్ ఖాన్. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుండగా, సల్మాన్ ఖాన్‌ను ‘రామాయణం’ సినిమా గురించి అడిగారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, తాను 20 ఏళ్ల క్రితమే ‘రామాయణం’ సినిమాను ప్రకటించానని, అయితే ఆ సినిమా ఆగిపోయిందని చెప్పారు. ఒకవేళ అవకాశం వస్తే రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించాలనుకుంటున్నారా అని సల్మాన్ ఖాన్‌ను రిపోర్టర్లు అడిగారు. దీనికి సల్మాన్ ఇలా సమాధానమిచ్చారు,

‘మీకు (జర్నలిస్టులకు) గుర్తుండే ఉంటుంది, 20 ఏళ్ల క్రితం మేము ‘రామాయణం’ చేయాల్సి ఉండేది. ఒక రోజు రాత్రి నేను, నా సోదరుడు (సోహైల్ ఖాన్) సినిమా ప్రకటన కోసం బయటకు వెళ్లాం. మరుసటి రోజు వార్తాపత్రికలలో కొంతమంది జర్నలిస్టులు నా, నా సోదరుడి ఫోటోలను ముద్రించారు. మా తలలపై కొద్దిగా వంకరగా రెండు కిరీటాలు పెట్టి, ‘ఇతనే మా రాముడు, ఇతనే మా లక్ష్మణుడు’ అని వ్యంగ్యంగా వార్తలు రాశారు. దాంతో మేము అక్కడికక్కడే ఆ సినిమాను వదిలేశాం’ అని చెప్పుకొచ్చారు సల్లూ భాయ్. కాగా చాలా మంది హీరోల్లాగే సల్మాన్ ఖాన్ ‘రామాయణం’ సినిమా చేయాలనుకున్నాడు. కానీ కొంతమందికి అతను రాముడి పాత్రలో కనిపించడం నచ్చలేదు, పైగా విమర్శించారు కూడా. అందుకే అతను ఆ సినిమాను ఆపేశాడు. కాగా ఇటీవల సల్మాన్ ఖాన్ ‘రామాయణం’ సినిమా గురించి కూడా గొప్పగా మాట్లాడాడు. ఇక అదే ఇంటర్వ్యూలో మీ జీవితం ఆధారంగా సినిమా తీస్తారా అని సల్మాన్ ఖాన్‌ను అడిగారు. అయితే, సల్మాన్ ఖాన్ దానిని స్పష్టంగా తోసిపుచ్చారు. వ్యంగ్యంగా ఇలా అన్నారు, “నా జీవితంపై సినిమా తీస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు.”

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ కొన్ని రోజుల్లో విడుదల కానుంది. మొదట ఈ సినిమాకు ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ సినిమా పేరు మారిపోయింది. ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్‌లో విడుదలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us