
ఇటీవల అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది తమ తల్లులకు మర్చిపోలేని బహమతులు ఇచ్చారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తమ మాతృమూర్తులకు రకరకాల కానుకలు ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ కూడా తన తల్లికి ఓ లగ్జరీ కారును కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా వాళ్ల అమ్మకు ఏ కలర్ కార్ కావాలో అడిగి మరీ కొనిచ్చాడు డీమాన్ పవన్. ఆవిడ మెరూన్ అనేసరికి అదే కలర్ టొయోటా హైరైడర్ కార్ ఎంపిక చేసుకున్నాడు. మొదట కేక్ కట్ చేసి తినిపించి ఆ తర్వాత అమ్మను కారులో కూర్చోబెట్టాడు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన పవన్.. ‘నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన మహిళకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఏ కష్టమొచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. నీ ప్రేమ నన్ను ఎల్లప్పుడూ నిలబెట్టింది. నీ బిడ్డగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నువ్వు చేసిన ప్రతి త్యాగానికి, నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మహిళలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ అమ్మపై ప్రేమను కురిపించాడు పవన్.
డీమాన్ పవన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ స్నేహితులు, బుల్లితెర సెలబ్రిటీలు అతనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రీతౌ చౌదరి, ఆర్జే చైతు, మర్యాద మనీష్, ఆకుల సోనియా తదితరులు కంగ్రాట్యులేషన్స్ అని కామెంట్స్ పెట్టారు. కాగా డీమాన్ పవన్ కొనుగోలు చేసిన కారు ధర భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ లో ఈ కారు ధర సుమారు రూ. 16 లక్షల మంచి 20 లక్షల వరకు ఉంటుందని టాక్.
కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు డీమాన్ పవన్. తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజేతగా నిలవకున్నా టాప్-3లో నిలిచి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్, డ్యాన్స్ రియాలిటీ షోస్ లో సందడి చేస్తున్నాడు పవన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.