Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ అవుట్.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

| Edited By: uppula Raju

Oct 03, 2021 | 10:51 PM

బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సిన హంగామా నడుస్తుంది. కంటెంస్టెంట్స్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. బిగ్ బాస్ హౌస్‌ను రణరంగా మారుస్తున్నారు.

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ అవుట్.. ఎమోషనల్ అయిన  కంటెస్టెంట్స్..
Natraj
Follow us on

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సిన హంగామా నడుస్తుంది. కంటెంస్టెంట్స్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. బిగ్ బాస్ హౌస్‌ను రణరంగా మారుస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో కావాల్సినంత డ్రామా జరుగుతుంది.గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈసీజన్‌లో రచ్చ కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగిపోయాయి. హౌస్‌లో ఫైర్ బ్రాండ్స్‌గా ఉన్న సరయు, ఉమా దేవి ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ వీక్ అందాల భామ లహరి కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది. ఈ వారం ఎలిమినేషన్‏లో సన్నీ, కాజల్, లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియ ఉన్నారు. వీరిలో ఫైనల్ గా లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ మిగిలారు.  ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే గత కొద్దిరోజులుగా యానీ మాస్టర్ ఎలిమినేట్ కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

నేటి ఎపిసోడ్ లో ఆదరిచేస్తా అతలాడించిన నాగ్ చివరిలో మాత్రం చాలా ఉత్కంఠకు గురిచేశాడు. ఇక నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమా 25ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌస్ మేట్స్ అంతా నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సినిమాలో పాటలకు అదిరిపోయే డాన్స్ లు వేస్తూ ఆకట్టుకున్నారు. జంటలుగా విడిపోయి మరీ డాన్స్ చేశారు హౌస్ మేట్స్.. వీరిలో హమీద -శ్రీరామ్.. అలాగే షన్ను- సిరీ డాన్స్ ఆకట్టుకుంది. ఇక హౌస్ మేట్స్ డాన్స్ కు నాగ్ ఫిదా అయ్యారు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి అంటూ ఎమోషనల్ అయ్యారు నాగ్. ఇక చివరిలో ఎలిమినేషన్ ప్రక్రియకు వచ్చే సరికి  ఆసక్తి మరింత పెరిగింది. సిరి, లోబో, యానీ మాస్టర్ , నటరాజ్‌లలో ఊహించని విధంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. దాంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక హౌస్ నుంచి నటరాజ్ బయటకు వెళ్తుంటే మిగిలిన వారు ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : మేనల్లుడి సినిమా పై ప్రశంసలు కురిపించిన ప‌వ‌ర్ స్టార్.. ‘రిపబ్లిక్’ టీమ్‌కు పవన్ అభినందనలు..

Idhe Maa Katha : సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాం.. ఇప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాం..

Samyukta Menon : రానాకు జోడీగా మలయాళీ ముద్ద మందారం.. భీమ్లానాయక్ సినిమాలో సోయగాల సంయుక్త..