
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఎవరి ఊహలు, అంచనాలకు అందడం లేదు. ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతోన్న ఈ రియాలిటీ షో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ అందిస్తోంది. అదే సమయంలో కంటెస్టెంట్లకు మాత్రం గుండె దడ పుట్టిస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో అని నిత్యం కంటెస్టెంట్లు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్
మైండ్ బ్లాక్ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరి కంటెస్టెంట్లను బయటకు పంపించిన బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో వారంలోనూ అదే నిర్ణయం తీసుకున్నాడు. తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. అందులో ప్రముఖ ఫోక్ సింగర్ ఝాన్సీ కూడా ఉంది. ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా సుధీర్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని బయటకు పంపే ప్రయత్నం జరగగా, ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌తో సుధీర్‌ను సేవ్ చేశాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యూహంలో భాగంగా సింగర్ ఝాన్సీ కూడా తన చేతిలో ఉన్న సేవింగ్ పవర్ ను కూడా పోగోట్టుకుంది. ఇది చివరకు ఆమెకు శాపంగా మారింది. ఒకవేళ ఆ పవర్ ఆమె దగ్గరే ఉండి ఉంటే తనను తాను కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ ఊహించని ఈ పరిణామంతో ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఝాన్సీ బిగ్ బాస్ హౌస్ ను వీడాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ ఫోక్ సింగర్ ఎలిమినేషన్ కు ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.
కాగా అగ్ని పరీక్ష సీజన్ 2 లో పాల్గొని సత్తా చాటింది సింగర్ ఝాన్సీ. ఆ తర్వాత మెయిన్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. కామనర్‌గా వచ్చినప్పటికీ తనదైన ఆటతో అభిమానుల మన్ననలు అందుకుందీ ఫోక్ సింగర్. సేఫ్ గేమ్ ఆడుతుందని విమర్శలు వచ్చినా తన దైన మాట తీరు, టాస్కుల్లో ఎఫర్ట్, హౌస్‌లో తన అభిప్రాయాలను చెప్పే విధానం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఝాన్సీ ఆట తీరు చూసి ఆమె కచ్చితంగా గ్రాండ్ ఫినాలే వరకు వస్తుందనకున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు ఎనిమిదో వారంలోనే ఆమె ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్‌గా బిగ్ బాస్ హౌస లోకి ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీకి వారానికి సుమారు రూ.70,000 నుండి రూ.75,000 వరకు పారితోషికం లభించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సుమారు ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు సుమారు సుమారు రూ.5.60 నుండి 6 లక్షల వరకు పారితోషికం ఝాన్సీకి దక్కనుందని తెలుస్తోంది. దీంతో పాటు ‘అగ్నిపరీక్ష’ టాస్క్ ద్వారా మరో 50 వేలు ఆమెకు అదనంగా లభించినట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి