
బుల్లితెర ప్రేక్షకులను ఖుషి చేసేందుకు బిగ్ బాస్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా అన్నీ ప్రముఖ భాషల్లోనూ బిగ్ బాస్ రియాలిటీ షో షురూ కానుంది. ఇక తెలుగులో ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి రియాలిటీ షోలో మరిన్ని హంగులు, ప్రత్యేకతలు తీసుకురానున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు,గేమ్స్, టాస్కుల నిర్వహణలోనూ కొత్త స్ట్రాటజీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాన్యుల కోసం త్వరలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే కంటెస్టెంట్ల జాబితాపై ఒక పెద్ద చర్చే జరుగుతోంది.
దీని ప్రకారం కొందరి బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది పేర్లు బిగ్ బాసక కంటెస్టెంట్ల లిస్టులో వినిపిస్తున్నాయి.
అయితే ఈ రీసెంట్ గా ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరింది. మొన్ననే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి రానుందని తెగ ప్రచారం జరుగుతోంద. ఆమె మరెవరో కాదు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ స్టార్ కిడ. సోదరుడు చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. అలాగే బ్రహ్మనందం ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్రహ్మా ఆనందం అనే సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ‘సినిమాలో హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనుంది దివిజ.ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరున విడుదల కానుంది.
అయితే దివిజ ప్రభాకర్ కూడా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయనుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే దివిజ అయినా నోరు విప్పాలి లేదా బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకైనా ఆగాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి