Bigg Boss Telugu 10: 35 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పి మోసం చేశారు.. బిగ్‌బాస్‌పై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు

సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. భారీగా ప్రైజ్ మనీతో పాటు కారు, నెక్లెస్ కూడా గెల్చుకున్నాడు. అయితే మూడేళ్ల తర్వాత బిగ్ బాస్ ప్రైజ్ మనీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు పల్లవి ప్రశాంత్.

Bigg Boss Telugu 10: 35 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పి మోసం చేశారు.. బిగ్‌బాస్‌పై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు
Bigg Boss Telugu 10

Updated on: Aug 16, 2026 | 6:29 PM

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలతో పాటు సామన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా కామనర్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారు. అయితే సుమారు మూడేళ్ల క్రితమే ఏడో సీజన్ లో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే విజేతగా నిలిచిన అనంతరం తన బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పంచు తానని పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే తీరా చూస్తే రైతులకు డబ్బు సాయం గురించి అసలు పట్టించుకోలేదు పల్లవి ప్రశాంత్. ఈ విషయంపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడీ బిగ్ బాస్ విన్నర్. తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనను పూర్తిగా మోసం చేశారంటూ వాపోయాడు.

 

ఇవి కూడా చదవండి

‘ బిగ్ బాస్ రియాలిటీ షో నేను గెలుచుకున్న ప్రైజ్‌మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే కారు తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? చివరకు ప్రైజ్‌మనీలో నుంచి తీసుకుంటామని చెప్పారు. ఇక నెక్లెస్ విషయానికొస్తే టీమ్ గిఫ్ట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రూ.5 లక్షల కట్టాలని చెప్పారు. గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందన్నారు. వాళ్లు చెప్పిన దానికి, నాకు వచ్చినదానికి చాలా తేడా ఉంది. ఏందన్నా ఇదంతా అని అడిగితే.. రూల్స్ రూల్సే’ అని వాపోయాడు రైతు బిడ్డ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. టాక్స్ కట్ చేయడం వరకూ ఓకే కానీ, గిఫ్ట్‌గా కారు, నెక్లెస్ ఇస్తున్నామని చెప్పి… దానికి కూడా డబ్బులు కట్టాలని చెప్పడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు పల్లవి ప్రశాంత్. మరి పల్లవి ప్రశాంత్ ఆరోపణలపై బిగ్‌బాస్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

పుట్టిన రోజు వేడుకల్లో పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us