Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో ఇవాళ డబుల్ ఎలిమినేషన్.. నీతూ మాస్టర్‌తో పాటు ఆ టాప్‌ కంటెస్టెంట్ కూడా ఔట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరోవైపు ఈ సీజన్ దాదాపు తుది దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు కేవలం కొద్ది వారాల సమయం మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో ఇవాళ డబుల్ ఎలిమినేషన్.. నీతూ మాస్టర్‌తో పాటు ఆ టాప్‌ కంటెస్టెంట్ కూడా ఔట్
Bigg Boss Telugu 10

Updated on: Nov 22, 2026 | 2:27 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 దాదాపు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 10 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదకొండో వారం కూడా ఎండింగ్ కు చేరుకుంది. ఇక బిగ్ బాస్ షోలో కీలకంగా భావించే గ్రాండ్ ఫినాలేకు కేవలం కొద్ది వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే టికెట్ టు ఫినాలే కోసం పోటీ ప్రారంభమైంది. టాప్ 5లో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో 11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి కెప్టెన్ జబర్దస్త్ నరేష్ తో సహా మొత్తం 11 మంది నామినేషన్స్ లో నిలిచారు. త్రిగుణ్, ముఖేష్, అమన్, దేబ్జాని, రామకృష్ణ, వర్షిణి, రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతు మాస్టర్ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటారు. అయితే ఈసారి షో నిర్వాహకులు ‘డబుల్ ఎలిమినేషన్’ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రాండ్ ఫినాలే సమయం దగ్గర పడుతుండటంతో కంటెస్టెంట్ల సంఖ్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో 11 వారంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆడియెన్స్ ఓటింగ్ సరళిని చూస్తుంటే ఈ వారం నీతూ మాస్టర్, యాంకర్ వర్షినీ, రామకృష్ణ, శివ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే 11వ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి నీతూ నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యిందని తెలుస్తోంది. ఓటింగ్‌లో ఆమె చివరి స్థానంలో ఉండడంత హౌస్ నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది. అయితే ఆమెతో పాటు మరొకరు కూడా ఈ వారంలోనే ఎలిమినేట్ కానున్నారని సమాచారం. వర్షిణీకి కొంత మేర ఆడియెన్స్ సపోర్ట్ ఉంది. అలాగే బిగ్ బాస్ అండదండలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ నుంచి ఆమె బయటపడిందని సమాచారం. ఇక రామకృష్ణ, సుధీర్, శివలు తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ ముంగిట ఉన్నట్లు చర్చ నడుస్తోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us