
అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. కాగా గత రెండు వారాల్లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ల వ్యవహారం ఆడియెన్స్ ను షాక్ కు గురిచేసింది. డబుల్ ఎలిమినేషన్ కారణంగా గత రెండు వారాల్లో మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. దీంతో తొమ్మిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఇప్పుడు రోహిత్ బయటకు వెళ్లిపోవడంతో ఇప్పుడు హౌస్ లో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ పోటీ ఏర్పడింది.దీంతో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అత్యంత వాడీవేడిగా సాగింది. పాత పగలు, కొత్త కోపాలు అన్నీ నామినేషన్స్ రూపంలో బయట పడ్డాయి. ఇక చివరకు ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేట్ కావడం గమనార్హం. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ వేటలో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ కూడా ఈ లిస్టులో ఉండడం ఆసక్తికరమైన విషయం. యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతు మాస్టర్, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఈ వారం నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. ఇక వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.
ప్రస్తుతం ఓటింగ్ సరళి చూస్తే ముఖేష్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆతర్వాత టెంపర్ వంశీ, దేబ్జానీ, సుధీర్, శివ్ కుమార్, అమన్, నరేష్, రామ్ ప్రసాద్, వర్షిణీ, నీతూ మాస్టర్ ఉన్నారు. ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న 10 మందిలో యాంకర్ వర్షిణి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ఈ యాంకరమ్మ ఈ వారం హౌస్ నుంచి బయటకు రావడం దాదాపు ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిజానికి గత వారమే వర్షిణి ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే కొన్ని సమీకరణాల వల్ల ఝాన్సీ బలైపోయింది. ఇక నామినేషన్ల ప్రక్రియలో కూడా తన సొంత స్నేహితులనే నామినేట్ చేయడం, తిరిగి వాళ్లతోనే నామినేట్ అవ్వడంతో ఈసారి వర్షిణికి ఎలిమినేషన్ గండం తప్పకపోవచ్చని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.