
సినిమాల్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎంతో మంది ఎన్నో కష్టాలు పడి సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు రాణిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఎంతో మంది ఎన్నో కష్టాలను, సమస్యలను చూశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాల్లో సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది తినడానికి తిండి లేక కష్టపడినా వారు కూడా ఉన్నారు. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తున్న చాలా మంది కెరీర్ బిగినింగ్ లో తినడానికి తిండిలేక అలమటించాడు కూడా.. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ కెరీర్ బిగినింగ్ లో ఫంక్షన్స్ లో పన్నీరు చాల్లే పని చేసింది. ఈవెంట్‌లో పన్నీరు చల్లితే రూ.1800 ఇచ్చారని ఎన్నో కష్టాలు పడి జీవితంలో సక్సెస్ అయ్యా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. అలాగే సినిమాల్లో, సీరియల్స్ లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ గేమ్ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. వారిలో అరియానా ఒకరు. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో అరియానా క్రేజ్ ను విపరీతంగా పెంచేసింది. బోల్డ్ బ్యూటీ అంటూ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. తన గేమ్ తో పాటు అందంతోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలతో యమా సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. కాగా అరియానా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో పడిన కష్టాలను గుర్తుచేసుకుంది. తాను వికారాబాద్ జిల్లా తాండూర్ లో పుట్టి పెరిగినట్లు తెలిపింది అరియానా. డిగ్రీ తరువాత యాంకర్ కావాలనే కోరికతో హైదరాబాద్‌కు వచ్చానని.. ఒక టీవీ ఛానెల్‌కు ప్రయత్నించి, 2015 మే 2న నెలకు 4000 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరానని తెలిపింది.. కుటుంబం నుండి పెద్దగా మద్దతు లేకపోయినా, తన కష్టాలను వారికి చెప్పకుండా, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని.. 4000 రూపాయల జీతంతో ఇంటి అద్దె 3000 కట్టాలి. మిగిలిన 1000 రూపాయలు పెట్రోల్ వంటి ఇతర ఖర్చులకు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాను అని తెలిపింది. అలాగే స్నేహితురాలి సలహా మేరకు పార్ట్‌టైమ్ ఈవెంట్లలో యాంకరింగ్ అవకాశాల కోసం వెతుకున్నా. మొదట ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో వచ్చిన వారికి పన్నీరు చల్లే పనికి 1800 రూపాయలు తీసుకున్నా అని తెలిపింది అరియానా. ఆతర్వాత యాంకర్ గా ఛాన్స్ లు అందుకున్నా.. ఈవెంట్లలో 5000 నుంచి 10,000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టా అని తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.