Bigg Boss Telugu 9: మీరు తప్ప ఇక్కడ నాకు ఎవరు లేరు.. కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు చేరువ అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గ్రాండ్ ఫినాలే వీక్ కావంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతున్నారు. కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

Bigg Boss Telugu 9: మీరు తప్ప ఇక్కడ నాకు ఎవరు లేరు.. కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి..
Biggboss9

Updated on: Dec 11, 2025 | 11:50 AM

బిగ్ బాస్ సీజన్ 9కు ఎండ్ కార్డు పడనుంది.. రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తి కానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి డబుల్ అయ్యింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. గతవారం హౌస్ నుంచి సంజన, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారని అనుకున్నారు కానీ ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇక సెకండ్ ఫైనలిస్ట్ కోసం రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ మేరకు హౌస్ మేట్స్ కు కొన్ని పాయింట్స్, కొంత స్కోర్ ఇచ్చాడు.

తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ వీడియోలో సుమన్ శెట్టి, భరణి, సంజన ఎమోషనల్ అయ్యారు. హౌస్ లో ఉన్నవారిలో సుమన్ శెట్టి దగ్గర తక్కువ పాయింట్స్ ఉండటంతో ఆయనను తర్వాతి పోటీ నుంచి తప్పించాడు బిగ్ బాస్. అయితే తన దగ్గరున్న పాయింట్స్ లో సగం హౌస్ లో ఒకరికి ఇచ్చే అవకాశం కల్పించాడు బిగ్ బాస్.

దాంతో సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యాడు. పోటీ నుంచి తప్పుకోవడంతో సుమన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత భరణి దగ్గరకు వెళ్లి.. నాకు మీరు తప్ప ఇక్కడ ఎవరు లేరు అంటూ భరణితో చెప్తూ ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి. సుమన్ మాటలు విన్న భరణి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితేపెయింట్  నీ పాయింట్స్ నాతో పాటు మరొకరికి కూడా ఉపయోగపడతాయి ఎవరు అని భరణి అడగ్గా సంజన అని చెప్పాడు సుమన్. దాంతో సంజనకు ఇచ్చేయమని చెప్పాడు భరణి. దాంతో సుమన్ వెళ్లి సంజన గారు నా పాయింట్స్ మీకు ఇద్దమనుకుంటున్నా అని చెప్పగానే సంజన బోరుమంది. నాకు ఎవరినైనా అడగాలంటే మొహమాటం.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్ గా సంజనకు ఇచ్చాడు సుమన్. ఆతర్వాత మిగిలిన వారికి టాస్క్ ఇచ్చాడు.. ఇది జోక్ కాదు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు భరణి సంచలక్ గా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.