Bigg Boss Telugu 9: అదృష్టం అంటే నీదే భయ్యా..! అందరూ నామినేట్ అయ్యారు.. అతను తప్ప

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారంలోకి అడుగు పెట్టింది. తొమ్మిదో వారంలో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ‌లో 11 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఇమ్మాన్యూయెల్‌, తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, సుమన్‌ శెట్టి, గౌరవ్‌, నిఖిల్‌, దివ్య నికితా, భరణి, సంజనా ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు.

Bigg Boss Telugu 9: అదృష్టం అంటే నీదే భయ్యా..! అందరూ నామినేట్ అయ్యారు.. అతను తప్ప
Bigg Boss9

Updated on: Nov 11, 2025 | 8:07 AM

బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్.. హౌస్ లో ఈవారం అందరూ నామినేట్ అయ్యారు. ఒక్కరు తప్ప.. సోమవారం వచ్చిందంటే చాలు హౌస్ లో నామిషన్స్ షురూ అవుతాయి. ఇప్పటివరకూ జరిగిన నామినేషన్స్ ఒకెత్తు నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ ఒకెత్తు.. ఏకంగా హౌస్ లో ఉన్న అందరూ నామినేట్ అయ్యారు. ఒక్కరు తప్ప.. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కొంతమంది చెప్పిన పాయింట్స్‌నే మళ్లీ చెప్పి నామినేట్ చేస్తే మరికొంత మంది మాత్రం కొత్త కొత్త పాయింట్స్ తో నామినేట్ చేశారు. ప్రస్తుతం11 మంది సభ్యులున్నారు. ఇంకా ఆరు వారాల ఆట మాత్రమే మిగిలుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఏకంగా 10మంది నామినేట్ అయ్యారు. ఇక హౌస్‌మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఓ టైమర్ పెట్టాడు బిగ్ బాస్.. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి.. మీ నామినేషన్ కేవలం ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అలాగే నామినేట్ అయిన వారు షవర్ కింద కూర్చోవాలి.. వారి పై బురద నీరు పడుతుంది.

ముందుగా ఇమ్మానుయేల్‌ నామినేషన్స్ మొదలు పెట్టారు. ముందుగా ఇమ్మానుయేల్‌ భరణిని నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ లో కెప్టెన్సీ టాస్క్‌లో మీరు తనూజ కోసం గివప్ చేయడం నాకు నచ్చలేదు అని తన పాయింట్ చెప్పాడు ఇమ్మూ.. మీరు కూడా ఎప్పటి నుంచో కెప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు.. కానీ తనుజ కోసం మీరు వదిలేశారు అని చెప్పుకొచ్చాడు ఇమ్మూ. ఆ తర్వాత దివ్యని నామినేట్ చేసింది రీతూ.. కెప్టెన్సీ కంటెండర్ రేసులో సాయికి ఒకరిని తీసే ఛాన్స్ వస్తే ఫస్ట్ నిన్ను ఎలిమినేట్ చేయాలని అనుకున్నాడు.. కానీ నువ్వు అతన్ని మేనిపులేట్ చేసి నన్ను ఎలిమినేట్ చేయాలని ట్రై చేసావ్.. ఇలా నువ్వు హౌస్ లో ఓ గ్యాంగ్ క్రియేట్ చేసుకొని నువ్వు చెప్పింది వాళ్లు చేయాలి అనుకుంటావ్.. నీకు అవసరం వచ్చినప్పుడు బాణాల్లా వాళ్లని వదులుతావ్.. అలానే గేమ్ విషయానికొస్తే ఓవర్ స్మార్ట్‌గా ఉన్నట్లు అనిపించింది.. అంటూ రీతూ పాయింట్ చెప్పింది. దాంతో దివ్య కూడా రీతూకి గట్టిగా ఇచ్చిపడేసింది. చెప్పినట్లు చేసేయడానికి వాళ్లందరూ చిన్న పిల్లలా.. అంటూ దివ్య కౌంటర్లు వేసింది.

గౌరవ్‌ సంజనను నామినేట్ చేశాడు. సంజనగారు మీ పెర్ఫామెన్స్ ఏం లేదు.. ఒక్క టాస్క్ కూడా మీరు గెలవలేదు.. ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంది.. అలానే సెల్ఫిష్ అనిపిస్తున్నారు.. అంటూ పాటింట్ చెప్పాడు. కళ్యాణ్ నిఖిల్ ను నామినేట్ చేశాడు. దివ్య.. గౌరవ్‌ని నామినేట్ చేసింది. దివ్య, గౌరవ్ మధ్య గట్టిగానే వాదన జరిగింది. దివ్య పాయింట్స్ కు గౌరవ్ గట్టిగానే సమాధానం చెప్పాడు. సుమన్ శెట్టికి ఛాన్స్ రాగానే నిఖిల్‌ని నామినేట్ చేశాడు. తనూజ కూడా గౌరవ్ ను నామినేట్ చేసింది. ఆతర్వాత గౌరవ్‌ని నామినేట్ చేశాడు డీమాన్. ఆతర్వాత భరణి వచ్చి దివ్యని నామినేట్ చేయడం అందరికీ షాకిచ్చింది. భరణి వాదనకి దివ్య అసలు ఒప్పుకోలేదు. ఓ రేంజ్ లో ఇద్దరి మధ్య వాదన జరిగింది. సంజనకి ఛాన్స్ రాగానే గౌరవ్‌ని నామినేట్ చేసింది. చివరిగా నిఖిల్ కు ఛాన్స్ రాగానే రీతూని నామినేట్ చేశాడు. నామినేషన్ పూర్తయ్యింది అని అంతా అనుకునేలోగా బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. నా వంతు.. మీ పట్ల మీ ఆట పట్ల ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయం మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఇదే అని నేను నిర్ణయించాను.. అందుకే ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపేందుకు అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను.. ఈ నామినేషన్ మీ కళ్లు తెరిపిస్తాయో మీ కోసం బిగ్‌బాస్ ఇంటి గేట్లు తెరుచుకుంటాయో ఈ వారం మీ కోసం మీరు చేసే యుద్ధమే నిర్ణయిస్తుంది. అంటూ హౌస్ లో ఉన్నవారందరిని డైరెక్ట్ గా నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఈ సారి నామినేషన్ లో కెప్టెన్ను కూడా నామినేట్ చేశాడు బిగ్ బాస్. కెప్టెన్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలా లేక నామినేట్ అవ్వాలా అనే నిర్ణయం  హౌస్ మేట్స్ చేతిలోనే ఉంది అని ఇమ్మాన్యుయేల్ కోసం ఓటింగ్ పెట్టాడు. హౌస్ లో భరణి తప్ప మిగిలినవారందరూ ఇమ్మూకి కెప్టెన్ అవ్వడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ దక్కాలని ఓటు చేశారు. దాంతో ఇమ్మూ మళ్ళీ సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా ఇమ్మానుయేల్ మినహా మిగిలిన 10 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.