
బిగ్ బాస్ హౌస్ లో గ్లామరస్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది రతికా రోజ్. సీజన్ సెవన్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ఆ అయ్యి తిరిగి ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చింది రతికా.. గతంలో హౌస్ లో రైతు బిడ్డ ప్రశాంత్ తో పులిహోర కలిపి హాట్ టాపిక్ అయ్యింది రతికా. ఎప్పుడు చుసిన ప్రశాంత్ తో తిరుగుతుండటంతో ఆడియన్స్ లో కూడా ఆమె పై నెగిటివిటీ ఎక్కువైంది. అది గమనించిన రతికా ప్రశాంత్ కు దూరంగా ఉంటూ తన గేమ్ తాను ఆడుతూ ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు గేమ్ ఆడింది తక్కువ గొడవలు పెట్టుకుంది ఎక్కువ. హౌస్ లో ఉన్నవారిలో దాదాపు అందరితో గొడవలు పెట్టుకుంది రతికా.. అడ్డదిడ్డంగా వాదిస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రశాంత్ ఎదో చనువుగా ప్రవర్తిస్తే చిరాకు పడటంతో పాటు అతడితో గట్టిగానే గొడవ పెట్టుకుంది. నువ్వెవర్రా బై అంటూ ఇష్టమొచ్చినట్టు పేలింది. దాంతో ప్రశాంత్ అక్క అంటూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని బ్రతిమిలాడుకోవాల్సి వచ్చింది.
ఇక ప్రశాంత్ తర్వాత యావర్ తో పులిహోర కలిపింది. దాంతో ఈ బ్యూటీ ఆట తీరు పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. దాంతో హౌస్ నుంచి ఎలిమినేట్ కూడా చేశారు. తక్కువ ఓట్లు పడటంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది రతికా.. కానీ ఆమెను ఆతర్వాత తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి శివాజీ, యావర్ లతోనే ఎక్కువ కనిపిస్తుంది. మొన్నీమధ్య యావర్ తో నేను నిన్ను, శివాజీ అన్నానే నమ్ముతున్నా.. అంటూ కోతలు కూడా కోసింది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో యావర్ తో గొడవ పడింది రతికా.. ఏకంగా యావర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఇద్దరి ఫోటోలను ఓ బొమ్మ షిప్ లో ఉంచి వాటిలో ఒక్కరినే బోట్ లో ఉంచి సేవ్ చేయాలి. మరొకరిని బయటకు తోసెయ్యాలి అని ఓ గేమ్ ఆడించాడు నాగ్. దాంతో ముందుగా యావర్ ను పిలిచి రతికా, శివాజీ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావ్ అని అడిగాడు నాగ్. దాంతో యావర్ శివాజీని సేవ్ చేసి, రతికాను పక్కనే పెట్టేశాడు. ఆతర్వాత రతికాను పిలిచి శివాజీ, యావర్ ఫోటోలు పెట్టగా శివాజీని సేవ్ చేసి యావర్ ను బయట పెట్టేసింది. దాంతో గొడవ షురూ అయ్యింది. ఇప్పుడిప్పుడే నాకు ఎవరి రంగు ఏంటి అన్నది తెలుస్తోంది సార్.. నా గేమ్ చూపిస్తా అంటూ సవాల్ విసిరింది రతికా. ఆతర్వాత యావర్ రతికా మధ్య డిస్కషన్ జరిగింది. నువ్వు ఫ్రెండ్ అని అనుకున్నా కదా.. నాకు బాగా బుద్ధి చెప్పావ్ అని రతికా యావర్ పై ఫైర్ అయ్యింది. రతికని పక్కకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి కాళ్ల కింద కూర్చొని మరీ ఆమెకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రతికా మాత్రం వినలేదు.. ఏదేదో తిక్క తిక్కగా మాట్లాడింది.