
బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. హౌస్ లో ఉన్న వారి ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించి ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో శివాజీ కొడుకు, అర్జున్ భార్య, గౌతమ్ మదర్, అశ్విని మదర్, శోభా శెట్టి మదర్, ప్రియాంక బాయ్ ఫ్రెండ్, భోలే భార్య, అమర్ దీప్ భార్య, ప్రశాంత్ తండ్రి, యావర్ అన్న హౌస్ లోకి వచ్చాడు. తమవారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు హౌస్ మెంబర్స్. ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి రావడం చూపించారు. బాపు నా బంగారం అంటూ హౌస్ లోకి వచ్చారు ప్రశాంత్ తండ్రి.
ముందుగా తమ పొలంలో పూసిన బంతిపూలు హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఆతర్వాత ప్రశాంత్ తండ్రి వచ్చాడు. తండ్రిని చూడగానే కాళ్ళమీద పడ్డాడు ప్రశాంత్. బాపు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిన్ను చూసి రెండు నెలలు అయ్యింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్ తండ్రి. ఆతర్వాత శివాజీని నా కొడుకును తండ్రిలా చూసుకుంటున్నారు అని అన్నారు. అలాగే అమర్ దీప్ తో కొట్లాడకండి మంచిగా ఉండండి అని చెప్పారు.
ఇక తాజాగా వదిలిన ప్రోమోలో రాతికకు సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. హౌస్ లోకి రతికా తండ్రి వచ్చాడు. తండ్రిని చూడగానే ఎమోషనల్ అయ్యింది రతికా.. ఆతర్వాత నేను ఎలా ఆడుతున్నాను. ఇంకా బాగా ఆడతా అంటూ చెప్పుకొచ్చింది. ఆతర్వాత హౌస్ లో ఉన్నవారందరిని పరిచయం చేసింది. ప్రశాంత్ ను చూసిన రతికా తండ్రి బాగా ఆడుతున్నావ్ .. ఇంకా మంచిగా ఆడు అని అన్నారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత రండి దావత్ ఇస్తా అని అన్నాడు రతికా తండ్రి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.