అంగరంగ వైభవంగా ‘భావ రస నాట్యోత్సవం’.. భరతనాట్యంతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ సతీమణి

'మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 1' అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 4న, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రత్యేకంగా ప్రదర్శించారు.

అంగరంగ వైభవంగా భావ రస నాట్యోత్సవం.. భరతనాట్యంతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ సతీమణి
Tollywood

Updated on: Jan 05, 2026 | 11:26 AM

‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’ అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 4న, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ భరతనాట్యం ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ మోహినియాట్టం ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఇక హైదరాబాద్ కు చెందిన విద్వాన్ సౌజన్య శ్రీనివాస్ (దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి) భరతనాట్య ప్రదర్శన చేసి ప్రేక్షుకులకు కనువిందు చేశారు. ఈ ముగ్గురు ప్రఖ్యాత కళాకారులు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

ఫీనిక్స్ గ్రూప్‌కి చెందిన ఎమెరిటస్ చైర్మన్ శ్రీ సురేష్ చుక్కపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్ ఘంభీరనట్టై రాగంలో స్వరపరిచిన ‘శ్రీ విఘ్నరాజం భజే’ అనే గణేశ కృతితో సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనను గొప్పగా ఆరంభించారు. అనంతరం ఒక్కొక్కరిగా వేదికపై నర్తించి ఆ నటరాజే మురిసిపోయేలా చేశారు. శ్రీ త్రిశూర్ మోహన్ కుమార్ సరమతి రాగంలో స్వరపరిచిన మోహినీయాట్టం వర్ణం శ్రీమతి స్వర్ణ రాజేంద్రచే ప్రదర్శించబడినది. రాగమాలిక రాగంలో శ్రీ ఆదిశంకరాచార్య స్వరపరిచిన అర్ధనారీశ్వర స్తోత్రంకు సౌజన్య శ్రీనివాస్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. రాగమాలిక రాగంలో శివప్రసాద పంచకంకు శ్రీమతి మంజు నాయర్ భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు.

సింహేంద్ర మధ్యమం రాగంలో స్వరపరిచిన అష్టపదికి శ్రీమతి మంజు నాయర్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. శ్రీ రాగంలో స్వరపరిచిన త్యాగరాజ కృతి అయిన ఎందరో మహానుభావులకు సౌజన్య శ్రీనివాస్ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. శుద్ధసారంగ రాగంలో స్వరపరిచిన ఆంజనేయ కీర్తనకు శ్రీమతి మంజు నాయర్ గొప్ప ప్రదర్శన . భూపాల రాగంలో మోహినియాట్టం తిల్లానాకు శ్రీమతి స్వప్న రాజేంద్ర అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us