Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..
మొత్తం ఐదుగురితో కలిసి పార్టీ హేమ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. రేవ్ పార్టీని నిర్వహించడంతోపాటు.. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో నటి హేమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరచనున్నారు.

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరయ్యింది నటి హేమ. రేవ్ పార్టీ ఆర్గనైజింగ్ టీంలో హేమ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఐదుగురితో కలిసి పార్టీ హేమ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. రేవ్ పార్టీని నిర్వహించడంతోపాటు.. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో నటి హేమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరచనున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు నటి హేమకు బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపించారు. కానీ ప్రతిసారి వివిధ కారణాలు చెబుతూ విచారణకు వెళ్లలేదు నటి హేమ.
దీంతో ఆమె తీరుపై విసుగు చెందిన పోలీసులు ఈరోజు హైదరాబాద్ చెరుకుని నటి హేమకు మరోసారి నోటీసులు పంపించగా.. ఎట్టకేలకు పోలీసుల ముందుకు బురఖాలో వెళ్లింది. అయితే విచారణలో పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని.. అలాగే పార్టీ ప్లాన్ చేయడం.. నిర్వహించడంలో హేమ కీలకపాత్ర పోషించినట్లు వెల్లడింది. దీంతో నటి హేమను అదుపులోకి తీసుకున్నారు బెంగుళూరు పోలీసులు. జనరల్ హాస్పిటల్లో హేమాకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. ఈరోజు రాత్రికి స్టేట్ హోమ్ కు తరలించనున్నారు. రేపు మెజిస్ట్రేట్ ముందు హేమాను హాజరు పర్చనున్నారు.
గతనెల 20న బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు.. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు. వారందరి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని.. ఇంట్లోనే ఉన్నట్లు ఓ వీడియో రిలీజ్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది హేమ. దీంతో పోలీసులు ఆమె ఫోటోను రిలీజ్ చేశారు. అందులో హేమ డ్రెస్, వీడియోలోని డ్రెస్ ఒకటే కావడంతో హేమ పార్టీలో పాల్గొన్నట్లు స్పష్టమయ్యింది. అలాగే రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి బ్లడ్ టెస్ట్ చేయగా.. అందులో హేమకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెను విచారణకు హాజరుకావాలంటూ రెండుసార్లు నోటీసులు పంపించారు బెంగుళూరు పోలీసులు. ప్రతిసారి అనేక కారణాలు చెప్పిన హేమ.. ఎట్టకేలకు పోలీసుల ముందుకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.