New Movies In This Week: ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న సినిమాలు.. ఆ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్..

|

Apr 11, 2022 | 4:54 PM

New Movies In This Week: ఒకప్పుడు శుక్రవారం(Friday) వస్తుందంటే చాలు.. కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యేవి.. అయితే ఇప్పుడు శుక్రవారం సెంటిమెంట్ ను పక్కన పెట్టి.. బాక్సాఫీస్..

New Movies In This Week: ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న సినిమాలు.. ఆ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్..
New Movies In This Week
Follow us on

New Movies In This Week: ఒకప్పుడు శుక్రవారం(Friday) వస్తుందంటే చాలు.. కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యేవి.. అయితే ఇప్పుడు శుక్రవారం సెంటిమెంట్ ను పక్కన పెట్టి.. బాక్సాఫీస్ వద్ద అనుకూల సమయాన్ని ఎంచుకుని తమ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక కరోనా అనంతరం అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ లో కూడా కొత్త సినిమాలను, బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ వంటి వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజూ ఏదోకటి కొత్త సినిమానో, సిరీస్ నో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం సినిమా థియేర్లతో పాటు, ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ వారం బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

ఏప్రిల్‌ 13న కోలీవువ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ రిలీజ్ కానుంది. పూజాహెగ్డే  హీరోయిన్.  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

కేజీయఫ్‌ సీక్వెల్ గా తెరకెక్కిన ‘కేజీయఫ్‌ 2’  ఏప్రిల్‌ 14న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్నది.

అయితే ఏప్రిల్‌ 14న బాలీవుడ్ సినిమా  షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన జెర్సీ కూడా రిలీజ్ కావాల్సింది. అయితే ‘కేజీయఫ్‌-2’ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని జెర్సీ నిర్మాతలు తమ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు: 

సోనీలివ్: శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఏప్రిల్‌ 14  రిలీజ్ కానుంది.

ఎంఎక్స్‌ ప్లేయర్‌: దహనం  ఏప్రిల్‌ 14 న విడుదల కానుంది.

జీ 5:  వెబ్ సిరీస్ ..  గాలివాన   ఏప్రిల్‌ 14న రిలీజ్ కానుంది.

ఆహా:   బ్లడీ మేరీ  ఏప్రిల్‌15న సందడి చేయనుంది.

Also Read : Pakistan Political Crisis: షెహబాజ్ షరీఫ్ ముందు ఎన్నో సవాళ్లు.. కలవరపెడుతున్న దేశ ఆర్థిక పరిస్థితి..

Corona Virus: పుట్టినిల్లు చైనాని వణికిస్తున్న కరోనా… మరో మహానగరంలో కఠిన ఆంక్షలు.. స్కూల్స్, ఫ్యాక్టరీలు మూసివేత