Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్.. కాదనలేకపోయినా బండ్ల గణేశ్.. ఆసక్తికర ట్వీట్..

|

Aug 27, 2021 | 10:08 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్‏కు ఉన్న

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్.. కాదనలేకపోయినా బండ్ల గణేశ్..  ఆసక్తికర ట్వీట్..
Bandla Ganesh
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్‏కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పవన్‏ను అమితంగా ఇష్టపడుతుంటారు. ఇక చాలా కాలం తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. పవన్‏ను అభిమానించేవారిలో నిర్మాత బండ్ల గణేశ్ ముందుటాడు. పవన్ సినిమాలను నిర్మించేందుకు బండ్ల గణేశ్ ఆసక్తి చూపిస్తుంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దరకత్వం వహించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. డబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్‏కు కూడా గుర్తింపు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల వకీల్ సాబ్ సినిమా ఈవెంట్‏లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ గురించి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే గబ్బర్ సింగ్ సినిమాను తమ ప్రాంతాల్లో కూడా ప్రదర్శించాలని నెటిజన్లు ఇప్పుడు బండ్ల గణేష్‏ను సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మా ప్రాంతాల్లో కూడా షో వేయించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటికి బండ్ల గణేష్ స్పందించాడు. దయచేసి మీరందరూ మీ ఊర్లో థియేటర్ బుక్ చేసుకొండి. షోకి నేను పర్మిషన్ ఇస్తాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది.

ట్వీట్..

Also Read: Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

Obulamma Song: ఆకట్టుకుంటున్న ఓబులమ్మ మెలోడి సాంగ్.. వైష్ణవ్, రకుల్ నయా లుక్స్ అదుర్స్..