Vijay TVK- Trisha: టీవీకే విజయ్ ప్రభంజనం వేళ.. హీరోయిన్ త్రిషపై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే భారీ విజయానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ తో పాటు హీరోయిన్ త్రిష పేరు కూడా ట్రెండింగ్ లో ఉంటోంది. విజయ్ కు మద్దతుగా త్రిష కూడా రాజకీయాల్లో చేరనుందని ప్రచారం జరుగుతోంది.

Vijay TVK- Trisha: టీవీకే విజయ్ ప్రభంజనం వేళ.. హీరోయిన్ త్రిషపై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Vijay TVK, Trisha, Bandla Ganesh

Updated on: May 04, 2026 | 1:58 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అనూహ్యమైన రీతిలో దూసుకుపోతోంది. ఇప్పటికే 110+ కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం లాంఛనమే కానుంది. ఇదిలా ఉంటే మరోవైపు త్రిష పేరు కూడా ఇప్పుడు తెగ ట్రెండింగ్ అవుతోంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడం, ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అక్కడి నుంచి నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడంతో ఇప్పుడు ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది. అంతేకాదు విజయ్ కు మద్దతుగా త్రిష కూడా రాజకీయాల్లోకి రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు త్రిషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభంజనం నేపథ్యంలో ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.ఈ తరుణంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ త్రిషను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష ’ అంటూ ట్వీట్ చేశారు బండ్లన్న. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఓ వైపు విజయ్ ప్రభంజనం.. మరోవైపు త్రిష ఆకాంక్షలను ఉద్దేశించే బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

కాగా విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇక విజయ్ పార్టీ విజయాన్ని ఆకాంక్షించేలా సోషల్ మీడియాలో త్రిష షేర్ చేసిన పోస్టులు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

బండ్ల గణేష్ ట్వీట్..

 

కాగా తమిళనాడు రాజకీయాల్లో విజయం సాధించిన విజయ్ కు సినీ ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నాని ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా విజయ్‌ను అభినందించిన నాని ‘ముందు సందేహించారు.. ఆ తర్వాత కిరీటం పెట్టారు. మన ఇంట్లో జరిగినదే(పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీని ఉద్దేశించి) ఇప్పుడు మన పొరుగు ఇంట్లో జరుగుతోంది. అండర్‌డాగ్‌గా భావించిన వ్యక్తి గెలవడం ఎప్పుడూ సినిమా లాంటి అనుభూతినిస్తుంది. అది రాజకీయాల్లోనూ అలాగే కనిపిస్తోంది. తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారికి అంతా మంచి జరగాలి’ అని ఆశించారు నాని.

హీరో నాని ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us