విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. తాజాగా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అదరగొట్టాడు. కామెడీ సీన్స్ లో విశ్వక్ ఆకట్టుకున్నాడు. అలాగే విశ్వక్ సేన్ యాక్షన్ సీన్స్ తోపాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. పృథ్వి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపాయి.
ఈవివాదం పై విశ్వక్ సేన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ పలాన వ్యక్తి స్టేజి మీద ఏం మాట్లాడుతాడు అనేది మేము ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను, నిర్మాత సాహు గారు చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే సోషల్ మీడియా అంతా బాయ్ కాట్ లైలా అని కనిపించింది. మ్యాటర్ ఏంటి అని ఆరా తీస్తే అప్పుడు విషయం మాకు అర్థమైంది అని విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ వివాదం పై నటుడు నిర్మాత బండ్లగణేష్ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బండ్ల గన్స్ మాట్లాడుతూ.. రాజకీయాలను, సినిమాలను ఒకటిగా చూడకూడదు, రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు… సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటీనటుల నోటి దూల వల్ల సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి అని అన్నారు బండ్ల గణేష్.
రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు.
రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు.
ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి.
నటించిన వారి నోటి దూలకు సినిమా లకు సమస్య రావడం దారుణం.
సినిమా ను సినిమా గా చూడండి..All the best to laila…
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి