బాలయ్య షాకింగ్ లుక్..సినిమా కోసం..

|

Jan 20, 2020 | 3:04 PM

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే..ఎలాగైనా కనిపించడానికి వెనకాడరు అగ్రకథానాయకుడు బాలకృష్ణ. అందుకు భైరవ ద్వీపం, అధినాయకుడు, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలే ఉదాహారణ. డైరక్టర్ చెప్పింది తూచ తప్పకుండా పాటించడం బాలయ్య నైజం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవలే ఆయన రూలర్ సినిమాలో కూడా ఐరన్ మ్యాన్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు కూడా. తాజాగా నటసింహా నెక్ట్స్ మూవీలో ఓ విభిన్న గెటప్‌లో కనిపించబోతున్నట్టు ఆయన నయా లుక్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య తదుపరి మూవీని […]

బాలయ్య షాకింగ్ లుక్..సినిమా కోసం..
Follow us on

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే..ఎలాగైనా కనిపించడానికి వెనకాడరు అగ్రకథానాయకుడు బాలకృష్ణ. అందుకు భైరవ ద్వీపం, అధినాయకుడు, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలే ఉదాహారణ. డైరక్టర్ చెప్పింది తూచ తప్పకుండా పాటించడం బాలయ్య నైజం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవలే ఆయన రూలర్ సినిమాలో కూడా ఐరన్ మ్యాన్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు కూడా. తాజాగా నటసింహా నెక్ట్స్ మూవీలో ఓ విభిన్న గెటప్‌లో కనిపించబోతున్నట్టు ఆయన నయా లుక్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య తదుపరి మూవీని బోయపాటి శ్రీను డైరక్షన్‌లో చేయనున్నారు. గతంలో వీరిద్దరూ సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు అందించారు. వైట్ అండ్ వైట్ ఖద్దరు బట్టల్లో, కోర మీసంతో బాలయ్య రాయల్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.