కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు.. దేశంతో కూడా పనిలేదు. అందులో జేమ్స్ కామెరూన్ ఒకరు. పేరుకు హాలీవుడ్ అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యాడు జేమ్స్ కామెరూన్. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్రాంచైజ్‌గా నిలిచిన ‘అవతార్’ సిరీస్ మూడో భాగం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ ఈ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అవతార్ ఫస్ట్‌పార్ట్‌లో పాండోర ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన కామెరూన్..సెకండ్ పార్ట్‌లో సముద్ర గాథను ‘ది వే ఆఫ్ వాటర్’తో చూపించాడు. ఇప్పుడు థర్డ్‌పార్ట్‌లో అగ్ని చుట్టూ మొత్తం కథను నడిపించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్ధమవుతోంది. అందుకే పార్ట్-3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. మొదటి రెండు భాగాలను మించి ఈ మూడో సినిమా కోసం ఎఫర్ట్ పెట్టామని చెబుతోంది అవతార్ టీమ్. కలెక్షన్స్ కూడా అదేస్థాయిలో ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి కొనసాగింపుగా రానున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ఐమ్యాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కి భారత మార్కెట్‌లోనూ భారీ క్రేజ్ ఉంది. రీసెంట్‌గా బుక్‌మైషో డేటాలో 12 లక్షలకుపైగా ఇండియన్ లవర్స్ ఈ సినిమాపై తమ ఇంట్రస్ట్‌ను చూపించారు. అడ్వాన్స్ ఇంటరెస్ట్‌లో ఇంత భారీ నెంబర్లు సాధించడం పెద్ద సినిమాలకే సాధ్యం కాగా..ఇప్పుడు అవతార్ కూడా బెంచ్‌మార్క్ సృష్టించింది. మొదటి రెండు భాగాల్లో చూసిన భావోద్వేగం, విజువల్స్ ఈసారి కూడా మరింతగా ఉండబోతున్నాయన్న అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.
అవతార్ హీరో జేక్ సల్లి, హీరోయిన్ నెయ్టిరి మళ్లీ పాండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఈసారి కథలో కీలకంగా నిలిచేది కొత్త తెగ “యాష్ పీపుల్”. వారి నాయకురాలిగా ఊనా చాప్లిన్ కనిపించబోతున్నారు. ఆమె పాత్ర వరాంగ్‌పై హాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హైప్ ఉంది. భారత్‌లో అవతార్-3 మూవీ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే ఈసారి ఐమ్యాక్స్ అనుభవంతో పాటు, సినీ చరిత్రలోనే తొలిసారిగా డాల్బీ విజన్ సినిమా టెక్నాలజీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది..అవతార్ ఫైర్ అండ్ యాష్.
మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు. ఉన్నా మన సినిమాలను డామినేట్ చేసేంత స్థాయి ఉండదు. కానీ అవతార్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతి పోతుంది. ఇంతకీ ఈ చిత్ర బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా..?
అవతార్-1 మూవీ డిసెంబర్ 18, 2009లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఇప్పటి లెక్కల ప్రకారం 2 వేల 030 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేల కోట్లను వసూలు చేసింది ఈ మూవీ. ది వే ఆఫ్ వాటర్ పేరుతో వచ్చిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16, 2022న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయింది. 3 వేల 420 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ..ప్రపంచవ్యాప్తంగా 19 వేల 850 కోట్లు కలెక్ట్ చేసింది. ఫైర్ అండ్ యాష్‌గా వస్తున్న అవతార్ 3 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 2 వేల 137 కోట్లతో బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. 20 వేల కోట్లుకు పైగా ఈ మూవీ కలెక్ట్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
అవతార్-2తో పాటే షూట్ చేయడంతో అవతార్-3 మూవీకి తక్కువ ఖర్చు అయింది. అలాగే మోషన్ క్యాప్చర్, VFX రీ-యూజ్ చేయడంతో పాటు న్యూజీలాండ్ ట్యాక్స్ బ్రేక్స్ వల్ల కాస్ట్ తగ్గింది. మార్కెటింగ్, ప్రమోషన్స్‌ను కూడా కలుపుకుంటే 3వేల కోట్లు ఖర్చయినట్టు మేకర్స్ చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .