Nootokka Zillala: మే 7న రావడానికి ముస్తాబవుతోన్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’.. క్రిష్‌ సమర్పణలో..

|

Feb 18, 2021 | 2:44 PM

Avasarala Srinivas Nootokka Zillala Andagaadu: ఓవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగా మారాడు దర్శకుడు క్రిష్‌. వేదం, గమ్యం చిత్రాలను తన సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌లో నిర్మించాడు క్రిష్‌...

Nootokka Zillala: మే 7న రావడానికి ముస్తాబవుతోన్న నూటొక్క జిల్లాల అందగాడు.. క్రిష్‌ సమర్పణలో..
Follow us on

Avasarala Srinivas Nootokka Zillala Andagaadu: ఓవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగా మారాడు దర్శకుడు క్రిష్‌. వేదం, గమ్యం చిత్రాలను తన సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌లో నిర్మించాడు క్రిష్‌. ఇదిలా ఉంటే తాజాగా తన దర్శకత్వంలో కాకుండా మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు.


‘నూటొక్క జిల్లాల అందగాడు’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండగా క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైక్‌మెంట్స్‌ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు సయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటిస్తుండగా.. ‘చి.ల.సౌ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో రాచకొండ విద్యసాగర్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు శ్రీనివాస్‌ అవసరాల రచయితగా పనిచేస్తున్నాడు. ఈ సినిమాను మే 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Anupama Parameswaran: అందాల రాశి అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు నేడు.. శుభాకాంక్షలు వెల్లువ