Nootokka Jillala Andagadu : మీకు బట్టతల గురించి ఐడియా ఉందా… అయితే ఒక్కసారి 101 జిల్లాల అందగాడు చూసేయండి!

|

Sep 03, 2021 | 3:23 PM

Movie Review: ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకునే పది మాటల్లో రూపురేఖల గురించిన డైలాగులు తప్పకుండా ఉంటాయట. ఆరోగ్యం గురించి మాట్లాడుకోవడం కన్నా, అందం గురించి మాట్లాడుకునేవారి

Nootokka Jillala Andagadu : మీకు బట్టతల గురించి ఐడియా ఉందా... అయితే ఒక్కసారి 101 జిల్లాల అందగాడు చూసేయండి!
Follow us on

Nootokka Jillala Andagadu Review:

సినిమా: నూటొక్కజిల్లాల అందగాడు
సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, రుహానీ శర్మ, రోహిణి, కృష్ణభగవాన్‌ తదితరులు
రచన: శ్రీనివాస్‌ అవసరాల
సమర్పణ: దిల్‌రాజు, క్రిష్‌
నిర్మాతలు: శిరీష్‌, రాజీవ్‌రెడ్డి ఎడుగూరు, సాయిబాబు జాగర్లమూడి
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
సెన్సార్‌: యు
విడుదల: 3.9.21

ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకునే పది మాటల్లో రూపురేఖల గురించిన డైలాగులు తప్పకుండా ఉంటాయట. ఆరోగ్యం గురించి మాట్లాడుకోవడం కన్నా, అందం గురించి మాట్లాడుకునేవారి సంఖ్య మన సొసైటీలో నానాటికీ పెరుగుతోంది. అవతలి వారి మనసులతో ప్రమేయం లేకుండా జస్ట్ ఫర్‌ ఎ సేక్‌ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు… బాడీ షేమ్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ సెన్సిటివ్‌ పాయింట్‌తో రిలీజైన సినిమా నూటొక్కజిల్లాల అందగాడు. అసలు ఈ సినిమా ఏంటి..? ఒకసారి డీటైల్డ్ గా చూసేద్దాం.

గొత్తి సూర్యనారాయణ అనే కేరక్టర్‌లో అవసరాల శ్రీనివాస్‌ యాక్ట్ చేశారు. అంజలి కేరక్టర్‌ లో కనిపిస్తారు రుహానీ శర్మ. వీరిద్దరూ ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆ కంపెనీ ఓనర్‌ రవిప్రకాష్‌… అంజలికి కాలేజ్‌లో సీనియర్‌. అప్పట్లో ఒకట్రెండు సార్లు ఇద్దరు డేట్‌కి కూడా వెళ్లుంటారు. ఆ చనువుతో ఆమెతో పెళ్లి ప్రపోజల్‌ తెస్తాడు రవి. అయితే అంజలి మాత్రం సూర్యనారాయణ సెన్స్ ఆఫ్‌ హ్యూమర్‌కి ఫిదా అవుతుంది. సూర్యానికి కూడా అంజలి నచ్చుతుంది. అంతా బావుందనుకుంటున్న క్రమంలో సూర్యకున్న బట్టతల విషయం బయటపడుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆమె అతన్ని యాక్సెప్ట్ చేసిందా? రిజక్ట్ చేసిందా? అంజలి ఫ్యామిలీతో సూర్యకున్న ప్రాబ్లం ఏంటి? ఇటు సూర్యకి పెళ్లి సంబంధాలు చూసే అతని తల్లి ఎలా ఫీలయింది? వంటివన్నీ సెకండాఫ్‌లో వచ్చే విషయాలు!

టిపికల్‌ కామెడీ కేరక్టర్‌కి పర్ఫెక్ట్ గా సూటవుతారు అవసరాల శ్రీనివాస్‌. ఈ సినిమాలోనూ బట్టతల వ్యక్తిగా, విగ్గును సర్దుకుంటూ సొసైటీలో అందగాడిగా కనిపించాలనే తాపత్రయంతో అతను చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. ఫక్తు ఫ్యామిలీ గర్ల్, మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీకి రెప్లికా అంజలి కేరక్టర్‌. చి.ల.సౌ మూవీతో పక్కింటమ్మాయిగా పర్ఫెక్ట్ గా సూటయిన రుహానీ, ఈ సినిమాలోనూ చాలా బాగా నటించారు. బట్టతల భగవాన్‌గా కృష్ణభగవాన్‌ కేరక్టర్‌ నవ్వులు కురిపిస్తుంది. సింగిల్‌ మదర్‌ కేరక్టర్‌ని రోహిణి స్క్రీన్‌ మీద రూల్‌ చేసేశారు. మిడిల్‌ క్లాస్‌ మదర్‌ కేరక్టర్స్ రోహిణికి కొట్టిన పిండి. అటు హీరోయిన్‌ ఫాదర్‌గా, సొసైటీని అర్థం చేసుకున్న వ్యక్తిగా, సరైన టైమ్‌లో మంచి సలహాలు ఇచ్చే గైడ్‌గా శివన్నారాయణ కేరక్టర్‌ సూపర్‌. మోడ్రన్‌ థాట్స్ ఉన్నప్పటికీ, కూతురి ఫ్యూచర్‌ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఒక రకంగా ఇన్‌సెక్యూర్డ్ గా ఫీలయ్యే హీరోయిన్‌ మదర్‌ కేరక్టర్‌ని కూడా బాగా డిజైన్‌ చేశారు. హీరో ఫ్రెండ్స్ కేరక్టర్లు స్క్రీన్‌ మీద కనిపించినంత సేపు కడుపుబ్బ నవ్వుకోవచ్చు. బాలు పాటలను కూడా స్క్రీన్‌ప్లేలో చక్కగా ప్లేస్‌ చేశారు. హీరోయిన్‌ ముందు, హీరో.. అతని ఫ్రెండ్‌ పాడే పేరడీ పాటల సీన్‌ కూడా థియేటర్లో బాగా పేలింది.

సొసైటీలో కామన్‌గా చూస్తున్నంత మాత్రాన కొన్ని విషయాలు కరెక్ట్ కాదు. అందులో బాడీ షేమింగ్‌ ఒకటి. ఎదుటివ్యక్తిని తిట్టాల్సి వచ్చినప్పుడు నేరుగా తిట్టడం వేరు. అతని రూపురేఖలను ఎత్తి చూపించి కించపరచడం వేరు. వ్యక్తి మనోభావాలను దెబ్బతీసి అందులోనుంచి కామెడీ కోరుకోవడం సాధారణంగా చూస్తుంటాం. దానివల్ల అవతలివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నామనే సంగతిని చాలా మంది గుర్తించరు. నూటొక్కజిల్లాల అందగాడు సినిమాలో అలాంటి విషయాలను చాలా సెన్సిటివ్‌గా ప్రస్తావించారు. బట్టతల ఉన్న వ్యక్తి ఫేస్‌ చేసే ఇబ్బందులు, అతను పడే టెన్షన్లు, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్, మేరేజ్‌ ప్రపోజల్స్, మిస్ అయ్యే మ్యాచెస్‌, గర్ల్ ఫ్రెండ్‌ ఫీలింగ్స్, ఫ్రెండ్స్ సెటైర్స్… ఒకటేంటి…? ఆల్‌ యాంగిల్స్ లో ఇష్యూని డిస్కస్‌ చేశారు డైరక్టర్‌ సాగర్‌. దానికి తగ్గట్టు అవసరాల రాసిన డైలాగులు కూడా సినిమాలో బాగా మెర్జ్ అయ్యాయి. సింగిల్‌ లైనర్స్ గా గుర్తుండకపోయినా, సీన్‌ని మనసుకు హత్తుకునేలా చెప్పడానికి మంచి లైన్లు రాసుకున్నారు అవసరాల.
కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కోవడం మాకు మా పెద్దలు నేర్పించినట్టు, నీకు మేం నేర్పలేకపోయామని రోహిణి చెప్పే డైలాగు ఎలాంటివారినైనా ఆలోచింపజేస్తుంది. బాడీ షేమింగ్‌ మీద ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. లడ్డూబాబు, సైజ్‌ జీరోవంటివన్నీ ఈ తరహా సినిమాలే. కాకపోతే వాటిలో బరువు గురించి డిస్కస్‌ చేశారు. హిందీలో వచ్చిన బాలా, ఉజ్డా చమన్‌లో బాల్డ్ హెడ్‌ గురించి డిస్కస్‌ చేశారు. ఈ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ అన్నిట్లోనూ డిస్కస్‌ చేస్తున్న పాయింట్‌ ఏంటో ముందే ఆడియన్‌కి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే పెద్దగా ఎగ్జయిట్‌మెంట్‌ ఉండదు. కాకపోతే సిట్చువేషనల్‌ కామెడీ కాస్త రిలీఫ్‌ ఇస్తుంది. అలాంటి హెల్దీ కామెడీ నూటొక్క జిల్లాల అందగాడులో పుష్కలంగా కనిపిస్తుంది. సినిమా కాస్త స్లోగా అనిపించినా, ఒక్కసారి కథలో ఇన్వాల్వ్ అయ్యాక ఫ్లోలో సరదాగా చూసేయొచ్చు. మంచి ప్రొడక్షన్‌ వేల్యూస్‌ మెప్పిస్తాయి.

(డా. చల్లా భాగ్యలక్ష్మి -TV9 ET Desk)