Director Atlee: అజిత్, రజినీకాంత్ సినిమాల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ..

రజనీకాంత్ , విజయ్ అభిమానుల మధ్య మొదటి నుంచి పడదు. ఇప్పటికే చాలా ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. ఈ కారణంగానే అట్లీ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం లేదన్న టాక్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ప్రశ్నకు అట్లీ సమాధానమిచ్చాడు . గతంలో రజనీతో సినిమా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, అది కుదరలేదు అని క్లారిటీ ఇచ్చాడు. 

Director Atlee: అజిత్, రజినీకాంత్ సినిమాల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ..
Atlee

Updated on: Nov 17, 2023 | 12:22 PM

దళపతి విజయ్ అభిమానులకు అట్లీ అంటే చాలా ఇష్టం. విజయ్ తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి  వెళ్ళాడు అట్లీ. ఇదిలా ఉంటే అట్లీ ఎక్కువగా విజయ్ తోనే సినిమా చేస్తుండటంతో రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి. రజనీకాంత్ , విజయ్ అభిమానుల మధ్య మొదటి నుంచి పడదు. ఇప్పటికే చాలా ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. ఈ కారణంగానే అట్లీ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం లేదన్న టాక్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ప్రశ్నకు అట్లీ సమాధానమిచ్చాడు . గతంలో రజనీతో సినిమా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, అది కుదరలేదు అని క్లారిటీ ఇచ్చాడు.

షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాతో అట్లీ భారీ విజయాన్ని అందుకున్నాడు. బాలీవుడ్‌లోనూ అతని పేరు మార్మోగింది. ఈ సినిమా విడుదలైన తర్వాత అట్లీ చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చాడు.ఈ క్రమంలో ఆయనకు రజినీకాంత్ తో సినిమా పై ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో అట్లీ మాట్లాడుతూ..

నేను రజనీకాంత్‌కి పెద్ద అభిమానిని. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ‘ఎందిరన్‌’ సినిమాలో ఆయనతో చాలా రోజులు కలిసి పనిచేశాను. బాషా కంటే మంచి సినిమా ఇవ్వాలనేది నా ఉద్దేశం. అయితే ఆయనతో సినిమా చేసే అవకాశం నాకు ఇంకా రాలేదు. రజనీకాంత్ కూడా కథ తయారు చేయమని చాలాసార్లు చెప్పారు’ అని అట్లీ అన్నారు. దీంతో త్వరలో రజనీతో కలిసి పనిచేయాలని అట్లీ క్లారిటీ ఇచ్చాడు.

నటుడు అజిత్ కుమార్‌తో కలిసి పనిచేయడం గురించి కూడా అట్లీ మాట్లాడాడు. అజిత్‌తో కలిసి పనిచేయాలి. స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ‘రాజా రాణి’ షూటింగ్‌ సమయంలో అజిత్‌ను తొలిసారి కలిశాను. అజిత్‌ని పరిచయం చేసింది నయనతార. ఆ కథ ఓకే అయితే సినిమా చేస్తాం’ అని అట్లీ అన్నారు. విజయ్, అజిత్ అభిమానుల మధ్య తరచూ ఫ్యాన్స్ వార్ జరుగుతూనే ఉంటుంది. అట్లీ ప్రస్తుతం ‘జవాన్’ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. వరుణ్ ధావన్‌తో కలిసి హిందీలో ఓ సినిమా చేస్తున్నాడని టాక్ .  అలాగే  అట్లీ మళ్లీ షారుక్ తో చేస్తున్నడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.