నిన్నటి నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడి వేడిగా జరిగింది. ఈసారి శోభా శెట్టికి గట్టుగానే పడింది. ఆటు రైతు బిడ్డను కూడా ఓ ఆట ఆడుకున్నాడు అర్జున్. ఇన్నాళ్లు శివాజీ చెప్పినట్టు ఆడిన ప్రశాంత్ నిన్న అర్జున్ దెబ్బకు బిత్తరపోయాడు. మరో వైపు అమర్ కూడా ఈవారం పుంజుకున్నాడు. యావర్ తో గొడవ పెట్టుకున్న తన వాదనలో బలం కనిపించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా అర్జున్ ను ప్రశాంత్ నామినేట్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. అంతకు ముందు తనను నామినేట్ చేసిన అర్జున్ ను తిరిగి నామినేట్ చేశాడు ప్రశాంత్. దాంతో ఇద్దరి మధ్యన డిస్కషన్ వేడిగా జరిగింది. నేను ఎవరో చెప్తే ఆడుతున్నా అని నువ్ ఎలా అంటావ్ అన్న అని ప్రశాంత్ వాదన మొదలు పెట్టాడు. చాలా తిప్పలు పడి ఇక్కడికి వచ్చానో నాకు తెలుసు అని ప్రశాంత్ అన్నాడు. దానికి అర్జున్ నువ్వు ఇండివీడ్యువాలిటీ లేకుండా ఆడుతున్నావ్ అన్నాను కానీ ఎవరో చెబితే ఆడుతున్నావ్ అని నేను అని అన్నాడు.
దేని పై అర్జున్ కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడు. ఆతర్వాత ఇదే పాయింట్ మీద శివాజీ నామినేషన్ వేసుంటే నువ్వు ఇలానే వాదించేవాడివా..? లేక సైలెంట్ గా ఉండేవాడివా అని ప్రశ్నించాడు అర్జున్. ఇప్పటివరకు నువ్వు శివాజీ చెప్తే ఆడావు .. ఇంకా నాలుగు వారాలు మిగిలుంది ఇప్పటికైనా జాగ్రత్త నిచెప్పను అంతే అని క్లారిటీ ఇచ్చాడు అర్జున్.
ఆతర్వాత తన రెండో నామినేషన్ రతికాకు వేశాడు ప్రశాంత్. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు డల్ అయ్యావు అని రతికాను నామినేట్ చేశాడు ప్రశాంత్. దాంతో రతికా.. నా గేమ్ నీకు కనిపించడం లేదు కదా.. ఈసారి లాక్కొని అయినా, దొబ్బుకొని అయినా ఆడతా.. నా గేమ్ ఏంటో చూపిస్తా.. అంటూ సవాల్ చేసింది. ఆతర్వాత అశ్విని ప్రియాంకను నామినేట్ చేసింది. నేను బోలే వందమాట్లాడుకుంటాం నీకెందుకు. ఆయన వెళ్లిపోతుంటే భాదగా అనిపించి నేను వెళ్ళిపోతా అన్నాను నేను మనిషినే నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావ్.. నేను ఒంటి చేత్తో వండిపెడతా అని సవాల్ చేసింది అశ్విని. ఆతర్వాత అమర్ ను నామినేట్ చేసింది. పాట గురించేనా అంటూ అమర్ కామెడీ చేశాడు. నేను హర్ట్ అయ్యాను.. నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ బావా.. రా వేసెస్తా.. ఇక భయపడే రోజులు పోయాయ్.. రా అంటూ తొడ కొట్టి పిలిచింది అశ్విని దాంతో అమర్ వెళ్లి బాటిల్ తలపై పగలగొట్టించుకున్నాడు.