ఓటీటీ పుణ్యమా అని థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను ఆదరించడానికి డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయినా ఎనిమిది వారాలకు ఓటీటీలోకి రావడాలి కానీ కొన్ని సినిమాలు మాత్రం ఊహించని విధంగా ఓటీటీలో రిలీజ్ అయ్యి షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఓ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా ఏదో కాదు హిడింబ. యాంకర్ ఓంకార్ తమ్మడు అశ్విన్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాజుగారి గది అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 20 జులైన థియేటర్స్ లోకి వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కొత్త దర్శకుడు అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుంది. జులై 20న హిడింబ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్‌లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈమూవీ నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్టు 10న ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అఫీషియల్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో హిడింబ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో అశ్విన్ పోలీస్ ఆఫిసర్ గా నటించాడు. అభయ్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్ ట్రైనింగ్ లో ఉండగా ప్రేమించుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది.. అభయ్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా చేస్తుంటాడు. అనుకోకుండా ఈ ఇద్దరు కలిసి ఒక కేసు కోసం తిరిగి కలుస్తారు . సిటీలో వరుసగా అమ్మాయిల కిడ్నప్ లు జరుగుతుంటాయి. అయితే చాలా కష్టపడి అమ్మాయిలను కిడ్నప్ చేస్తున్న ముఠాను పట్టుకుంటారు ఈ ఇద్దరు. అయితే కేసు ముగిసిపోయిందని అంతా అనుకుంటారు. కానీ అదే సమయంలో మరో అమ్మాయి కిడ్నప్ అవుతుంది. దీంతో కేసు మళ్లీ మొదటికొస్తుంది. అయితే ఇంతలో అసలు విషయం తెలుస్తోంది. అయితే తాము కాపాడిన అమ్మాయిలు కాకుండా ఇంకా చాలా మంది కిడ్నప్ అయ్యారని అది వేరే ముఠా అని తెలుస్తోంది. ఆ నేరస్థుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. దాంతో ఊహించని షాక్ తగులుతుంది. వాళ్లను అతనేం చేస్తున్నాడు.? ఈ కథకు ఆదిమ తెగకు ఉన్న సంబంధం ఏంటి.? అన్నది సినిమా చూడాల్సిందే.