Rowdy Boys : సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న చిన్న సినిమా.. ‘రౌడీ బాయ్స్’ వచ్చేది అప్పుడేనా..?

|

Jan 04, 2022 | 5:14 PM

తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు

Rowdy Boys : సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న చిన్న సినిమా.. రౌడీ బాయ్స్ వచ్చేది అప్పుడేనా..?
Anupama
Follow us on

Rowdy Boys :తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా..  దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న  రౌడీ బాయ్స్ ను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయనున్నారు. జనవరి 15న ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. మరి దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రీసెంట్ ఈ చిత్రం నుంచి ‘బృందానం నుంచి కృష్ణుడు వ‌చ్చాడే.. య‌మునా తీరాన ఉన్న రాధ‌ను చూశాడే..’ అనే పాట‌ను రిలీజ్ చేశారు. కాలేజ్ ఫంక్ష‌న్‌లో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టేజ్‌పై పెర్ఫామ్ చేసేలా పాట‌ను అద్భుతంగా చిత్రీకరించారు. గోపిక‌మ్మ గెట‌ప్‌లో అనుప‌మ‌.. కృష్ణుడు క‌న్నెపిల్ల‌ల మ‌న‌సుల‌ను దోచె దొంగ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం విన‌సొంపుగా ఉంది. ఈ సాంగ్‌లో హీరో ఆశిష్ కూడా క‌నిపిస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సూప‌ర్బ్ ట్యూన్‌కు సుద్దాల అశోక్ తేజ పాట‌ను రాయ‌గా.. సింగ‌ర్ మంగ్లీ శ్రావ్యంగా ఆల‌పించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాట ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది.

కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలో సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అందరినీని మెప్పించేలా హిట్ చిత్రాల నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్.. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌, దేవిశ్రీప్ర‌సాద్‌, మ‌ది అండ్ టీమ్‌తో రూపొందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..