Captain Trailer: హాలీవుడ్ రేంజ్‌లో ఆర్య సినిమా.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్

|

Aug 22, 2022 | 8:13 PM

తమిళ్ హీరో ఆర్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆర్య.

Captain Trailer: హాలీవుడ్ రేంజ్‌లో ఆర్య సినిమా.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్
Captain
Follow us on

తమిళ్ హీరో ఆర్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆర్య. ఈ సినిమా తర్వాత ఆర్య నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. తాజాగా ఈ యాక్షన్ హీరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆర్య నటించిన సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.

‘కెప్టెన్’ విషయానికి వస్తే… వినూత్న కథాంశంతో సినిమా రూపొందింది. ఈ రోజు ఉదయం నితిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ‘కెప్టెన్’లో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు ఆర్య. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రలో ఆయన నటించారు. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. రెగ్యులర్ ఆర్మీ బేస్డ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్థాయిలో సినిమా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కోవడానికి హీరో అండ్ టీమ్ వెళ్ళినప్పుడు ఏమైందనేది కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆర్య జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి