సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో రిలీజ్ ఆలస్యమవుతుందనే వారి మాటలకు చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్‌గా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు నటుడు అర్జున్ విజయ్. సాహో చిత్రంలో ప్రభాస్‌తో పాటు విజయ్ కూడా నటించాడు. అయితే తాజాగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. అనుకున్న రోజే సాహో థియోటర్లకు వస్తాడని చెబుతున్నట్టుగా పిడికిలి బిగించి ఉన్న అర్జున్ విజయ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.