Anushka Shetty : నా ఫస్ట్ లవ్ అప్పుడే జరిగింది.. అతడు నేనంటే ఇష్టమన్నాడు.. నేను ఓకే చెప్పాను.. అనుష్క శెట్టి కామెంట్స్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, తన అద్భుతమైన నటనతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తాజాగా తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది అనుష్క.

సినీరంగంలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సూపర్ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం.. అరుంధతి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. గ్లామర్ పాత్రలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. అసలు పేరు స్వీటి శెట్టి. కానీ సినిమాల్లోకి వచ్చాకా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో నాగార్జున కలిసి ఆమెకు అనుష్క అనే పేరును నామకరణం చేశారు. సినిమాల్లోకి రాకముందు అనుష్క యోగా టీచర్ గా పనిచేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున సరసన నటించిన ‘సూపర్’ (2005) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాతో ఈమెకు మంచి బ్రేక్ లభించింది. అలాగే అరుంధతి మూవీతో అనుష్కకు స్టార్ డమ్ వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ చిత్రం ‘అరుంధతి’ (2009) లో జేజమ్మగా అనుష్క చూపించిన నటన ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాకు గాను ఆమె నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాలు ఆమె స్టార్ ఇమేజ్‌ను మరింత పెంచాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
అనుష్క శెట్టి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సహచర నటీనటుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమెకు ఇష్టమైన హీరోయిన్స్ జాబితాలో త్రిష, నయనతార ఉన్నారని తెలిపారు. భూమికను తన కుటుంబ సభ్యురాలిగా భావిస్తానని పేర్కొన్నారు. హీరోల విషయానికి వస్తే, నాగార్జున అత్యంత పాజిటివ్ వ్యక్తి అని, సుమంత్ తో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుందని అనుష్క వెల్లడించారు. తన వ్యక్తిగత బలహీనత గురించి ప్రస్తావిస్తూ, తాను ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టడం వల్ల తరచుగా అందుబాటులో ఉండనని, ఇది తనపై వచ్చే పెద్ద ఫిర్యాదు అని అంగీకరించారు. తన తొలి ప్రపోజల్ గురించి అడగ్గా, అది పాఠశాలలో ఆరో తరగతిలో ఉండగా జరిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో క్లాస్‌మేట్ అయిన ఒక అబ్బాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగా, ఓకే అని బదులిచ్చానని అనుష్క నవ్వుతూ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
