Anushka Shetty : నిశ్శబ్ధం సినిమా రిలీజ్ తరువాత అనుష్క కూడా సైలెంట్ అయిపోయారు. ఆ సినిమాకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రాకపోవటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆలోచనలో పడ్డారు స్వీటీ. లాంగ్ గ్యాప్ తరువాత.. ఇప్పుడు ఓ రీమేక్ సినిమాకు అనుష్క ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా సౌత్‌లో డిజిటల్ రిలీజ్ అయిన నెట్రికన్ సినిమాను అనుష్క తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. అదేంటి? నెట్రికన్ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది కదా.. మళ్లీ రీమేక్ ఏంటి అనుకుంటున్నారా..? ఈ విషయంలోనే మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారు అనుష్క.
అనుష్క మెగా ఫ్యామిలీని ఫాలో అవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? తెలుగులో వీరుడొక్కడే పేరుతో రిలీజ్ అయిన అజిత్ వీరం సినిమాను కాటమరాయుడుగా రీమేక్ చేశారు పవన్ కల్యాణ్… ఇప్పుడు చిరు కూడా ఆల్రెడీ తెలుగులో డిజిటల్ రిలీజ్ అయిన మోహన్ లాల్ లూసీఫర్‌ను రీమేక్ చేస్తున్నారు. అదే బాటలో అనుష్క కూడా తెలుగు ఆన్‌లైన్ రిలీజ్ అయిన సినిమాకు రీమేక్ ప్లాన్ రెడీ చేస్తున్నారన్నది టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న న్యూస్. కొరియన్ మూవీ బ్లైండ్‌కు రీమేక్‌గా తెరకెక్కింది నెట్రికన్.. కొరియన్ మూవీ టీమ్ దగ్గరే మూవీ రైట్స్ తీసుకునే పనిలో ఉన్నారట తెలుగు రీమేక్ మేకర్స్. అంతేకాదు ఆల్రెడీ ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవుతోంది. హిందీ వర్షన్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇన్ని లాంగ్వేజెస్‌లో నలిగి… ఆల్రెడీ ప్రొజెక్ట్ అయిన సినిమాను స్వీటీ కమ్‌బ్యాక్‌కి ఎందుకు సెలక్ట్ చేసుకున్నట్టు… ఇప్పుడు స్వీటీ ఫ్యాన్స్ లో డిస్కషన్ పాయింట్ ఇదే. మరి ఈ సినిమాతో స్వీటీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :